ETV Bharat / sports

'డబ్బు ఎక్కువ ఇచ్చారని బాల్​ స్వింగ్​ అవ్వదు'

ప్రొఫెషనల్​ క్రికెట్​ ఆడే ప్రతి ఆటగాడు ఒత్తిడికి లోనవుతారని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా పేసర్​ పాట్​ కమిన్స్​. ఐపీఎల్​ వేలంలో ఎక్కువ ధర పలికినంత మాత్రాన బౌలర్​కు అన్ని పరిస్థితులు కలిసి రాకపోవచ్చని అన్నాడు.

More money doesn't make ball swing more, wicket greener or boundaries bigger: Cummins
'డబ్బు ఎక్కువ ఇచ్చారని బాల్​ స్వింగ్​ అవ్వదు'
author img

By

Published : Mar 15, 2021, 5:46 PM IST

Updated : Mar 16, 2021, 9:18 AM IST

క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడికి ఒత్తిడి అనేది సాధారణమని అంటున్నాడు ఆస్ట్రేలియన్​ పేసర్​ పాట్​ కమిన్స్​. రకరకాల ఒత్తిడి కారణంగా సగటు క్రికెటర్​ ఉత్తమ ప్రదర్శన చేసే అవకాశం తక్కువని అన్నాడు. ఐపీఎల్​లో అత్యధిక ధర పలికినంత మాత్రానా, పరిస్థితులన్నీ కలిసి రావని తెలిపాడు.

"ప్రొఫెషనల్​ క్రికెట్​ ఆడేవాళ్లెవరైనా చాలా ఒత్తిడికి లోనవుతారు. ఏదైనా ఆట గెలిస్తే.. ఆ గెలుపును తర్వాతి మ్యాచ్​లో నిలుపుకోవాలనే ఒత్తిడి.. ఒకవేళ ఓడితే ఆటతీరుపై ఒత్తిడి.. ఇలా ఉంటూనే ఉంటుంది. నాకు తెలిసి ఐపీఎల్​ వేలం.. ఆటగాడిపై మరికొంత ఒత్తిడి తెస్తుంది. ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవాలనేదే మా ప్రయత్నం. డబ్బులు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన.. బాల్​ స్వింగ్​లోగానీ, బౌలర్లకు పిచ్​ అనుకూలతలో గానీ ఎలాంటి మార్పు ఉండదు. అదే విధంగా బౌండరీలు పెద్దవిగా మారవు. కాబట్టి, మైదానంలో ఆడేటప్పుడు ఆటపై మన ఏకాగ్రత ముఖ్యం. నేను కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టులో ఉన్న కారణంగా ఆ టీమ్ గెలుపొందేందుకు నా వంతు సహకారం అందిస్తాను".

- పాట్​ కమిన్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ పేసర్​

2019లో జరిగిన ఐపీఎల్​ వేలంలో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రూ.15.50 కోట్లతో పాట్​ కమిన్స్​ను సొంతం చేసుకుంది. ఆ సీజన్​ నుంచి ఇప్పటివరకు అత్యధిక పారితోషం అందుకున్న విదేశీ క్రికెటర్​గా ఘనత సాధించాడు. అయితే ఇటీవలే జరిగిన ఐపీఎల్​ వేలంలో దక్షిణాఫ్రికా పేసర్​ క్రిస్​ మోరిస్​ను రూ.16.25 కోట్లకు రాజస్థాన్​ రాయల్స్​ జట్టు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్​ చరిత్రలో భారీ ధర పలికిన విదేశీ ఆటగాడిగా క్రిస్​ మోరిస్​ రికార్డు దక్కించుకున్నాడు.

యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ ప్లేఆఫ్స్​కు చేరుకోలేకపోయింది. గత సీజన్​లో 14 మ్యాచ్​లు ఆడిన పాట్​ కమిన్స్​.. 7.86 ఎకానమీతో 12 వికెట్లను పడగొట్టాడు.

ఇదీ చూడండి: 'కోహ్లీ కెప్టెన్సీ మార్పులో అర్థం లేదు'

Last Updated : Mar 16, 2021, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.