టీమ్ఇండియా అత్యుత్తమ ఫీల్డర్లలో మహ్మద్ కైఫ్ ఒకరు. మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌లతో తనదైన గుర్తింపు తెచుకున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కైఫ్. 2004లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుత క్యాచ్‌ను షేర్ చేశాడు. "భయంలేని యువత అసాధ్యాన్ని ఛేదిస్తూ దానిని రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
2004లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది భారత్. మొదటి మ్యాచ్ కరాచీ వేదికగా జరిగింది. ఇందులో 5 పరుగుల తేడాతో ఉత్కంఠ పోరులో గెలిచింది ఇండియా. మొదట టాస్ గెలిచిన పాక్ టీమ్ఇండియాకు బ్యాటింగ్ అప్పజెప్పింది. సెహ్వాగ్ (79), రాహుల్ ద్రవిడ్ (99), గంగూలీ (45) సత్తాచాటడం వల్ల భారత్ 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్ 8 ఓవర్లు పూర్తయ్యే సరికి 34 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత ఇంజమామ్ ఉల్ హక్ (122), మహ్మద్ యూసఫ్‌తో కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. యూసఫ్ ఔటైన తర్వాత యూనిస్ ఖాన్‌తో కలిసి మరో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు ఇంజమామ్. దీంతో పాక్ గాడిన పడింది. చివర్లో 8 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది.
-
Fearlessness of youth makes you chase the impossible and grab it with both hands. Oops sorry Badani bhai. pic.twitter.com/Yn3yxJ1JEK
— Mohammad Kaif (@MohammadKaif) July 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fearlessness of youth makes you chase the impossible and grab it with both hands. Oops sorry Badani bhai. pic.twitter.com/Yn3yxJ1JEK
— Mohammad Kaif (@MohammadKaif) July 25, 2020Fearlessness of youth makes you chase the impossible and grab it with both hands. Oops sorry Badani bhai. pic.twitter.com/Yn3yxJ1JEK
— Mohammad Kaif (@MohammadKaif) July 25, 2020
కైఫ్ క్యాచ్ మలుపు
ఆ సమయంలో జహీర్ ఖాన్ వేసిన బంతిని షోయబ్ మాలిక్ గాల్లోకి లేపాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న కైఫ్ లాంగ్ ఆఫ్ వరకు పరుగెత్తుకొచ్చి బంతిని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హేమంగ్ బదానీకు చెందిన క్యాచ్‌ను కైఫ్ చేజిక్కించుకున్నాడు. ఫలితంగా కీలక మాలిక్ వికెట్ కోల్పోయిన పాక్ చివర్లో తడబడింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేక ఓటమిపాలైంది.