యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న ఆటగాళ్లు... ఆరు రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు పాటిస్తున్నారు. క్వారంటైన్ పూర్తికాగానే ఆయా జట్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి.
ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించి.. తమదైన ముద్ర వేసుకున్నారు కొంత మంది క్రికెటర్లు.
56 శతక వీరులు..
ఐపీఎల్ తొలి సీజన్ ఆరంభ మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. అందులో కోల్‌కతా జట్టుకు చెందిన బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్కల్లమ్ 78 బంతుల్లో 158 పరుగులు చేసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. అప్పటి నుంచి ఈ టోర్నీలో మొత్తం 56 శతకాలు నమోదయ్యాయి. అయితే ఐపీఎల్లో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన ప్లేయర్ల గురించి తెలుసుకుందామా..
1)ఐపీఎల్ 2013: విరాట్ కోహ్లీ (99) Vs దిల్లీ డేర్‌డెవిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో 99 పరుగులతో వెనుదిరిగిన రికార్డు ఉంది. ఐపీఎల్లో 99 రన్స్ వద్ద ఔట్ అయిన తొలి ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం.
![Missing the feat by a single run: IPL instances when batsmen were stranded on 99](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8561035_2.jpg)
2013లో దిల్లీ డేర్‌డెవిల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో 99 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి వెనుదిరిగాడు. దీంతో బెంగుళూరు జట్టు స్కోరు 183 మార్క్ అందుకుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సైన్యం దిల్లీపై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2)ఐపీఎల్ 2013: సురేశ్ రైనా (99 నాటౌట్) Vs సన్‌రైజర్స్ హైదరాబాద్
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో చిన్న తలాగా పేరొందిన సురేశ్ రైనా అనేక సార్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఒక్క పరుగు తేడాతో శతకాన్ని మిస్ అయ్యాడు.
![Missing the feat by a single run: IPL instances when batsmen were stranded on 99](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8561035_4.jpg)
తొలుత సీఎస్కే బ్యాటింగ్‌లో మూడో స్థానంలో దిగిన రైనా.. మైక్ హస్సీతో కలిసి 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 99 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు రైనా. 52 బంతుల్లోనే ఆ ఘనతను సాధించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'కు ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు 223 పరుగులు చేసి హైదరాబాద్‌పై 77 రన్స్ తేడాతో విజయం సాధించింది.
3)ఐపీఎల్ 2019: పృథ్వీషా (99) Vs కోల్‌కతా నైట్‌రైడర్స్
ఐపీఎల్లో అడుగుపెట్టిన రెండో సీజన్లోనే శతకానికి దగ్గరయ్యాడు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన పృథ్వీషా. ఈ యువ క్రికెటర్ కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. గతేడాది జరిగిన టోర్నీలో కోల్‌కతాపై ఈ ఘనతను సాధించాడు పృథ్వీషా.
![IPL news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8561035_489_8561035_1598444283836.png)
55 బంతుల్లో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. స్కోరు పరంగా ఆ మ్యాచ్ టై అవ్వగా తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో దిల్లీ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పృథ్వీషాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
4)ఐపీఎల్ 2019: క్రిస్ గేల్ (99 నాటౌట్) Vs ఆర్సీబీ
గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రిస్ గేల్.. తన మాజీ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టుపై 60 బంతుల్లో 99 పరుగుల(10 ఫోర్లు, 5 సిక్సర్లు)తో అజేయంగా నిలిచాడు.
![Missing the feat by a single run: IPL instances when batsmen were stranded on 99](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8561035_1.jpg)
ఆ మ్యాచ్‌లో పంజాబ్ స్కోరును 173కు చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు గేల్. ఆ తర్వాత బ్యాటింగ్ బరిలో దిగిన ఆర్సీబీ బ్యాట్స్మెన్లు కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథాగా మిగిలింది.