ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ మార్పుపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. సీజన్ మధ్యలో అలా మార్చడం జట్టుకు మంచిది కాదని ట్వీట్ చేశాడు.
-
Mid season change in Captaincy is never a comfortable situation for the team members. Hope #kkr doesn't go astray from here. They are very much in the race for the playoffs! #DineshKarthik #Eoinmorgan
— Irfan Pathan (@IrfanPathan) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mid season change in Captaincy is never a comfortable situation for the team members. Hope #kkr doesn't go astray from here. They are very much in the race for the playoffs! #DineshKarthik #Eoinmorgan
— Irfan Pathan (@IrfanPathan) October 16, 2020Mid season change in Captaincy is never a comfortable situation for the team members. Hope #kkr doesn't go astray from here. They are very much in the race for the playoffs! #DineshKarthik #Eoinmorgan
— Irfan Pathan (@IrfanPathan) October 16, 2020
టోర్నీలో వరుస ఓటములు ఎదురవుతుండటం వల్ల సారథి దినేశ్ కార్తిక్‌పై విమర్శలు వస్తున్నాయి. దీంతో ముంబయితో మ్యాచ్‌కు ముందు ఇయాన్ మోర్గాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ మేరకు ఫ్రాంచైజీ ప్రకటన కూడా చేసింది.
"ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యముండాలి. కానీ అతడి(దినేశ్ కార్తిక్) పనికి మేం మద్ధతుగా నిలుస్తున్నాం" అని కోల్‌కతా జట్టు సీఈఏ వెంకీ మైసూరు చెప్పారు.
ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి, నాలుగో స్థానంలో ఉంది కోల్‌కతా. ఫ్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ గెలివాల్సి ఉంటుంది!