టీమ్ఇండియా ఎన్ని వన్డే సిరీస్‌లు ఆడినా 1998లో షార్జా వేదికగా జరిగిన కోకా కోలా కప్‌ను మాత్రం ఏ అభిమానీ మర్చిపోలేడు. ఎందుకంటే.. ఆ కప్ పేరు వినగానే ఎడారి దేశంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సృష్టించిన సెంచరీల తుపాన్ గుర్తుకు వస్తుంది. ఇందులో ఆసీస్‌పై 143 (131 బంతులు) పరుగుల ఇన్నింగ్స్‌ను చూసిన వారికైతే రోమాలు నిక్క బొడుచుకుంటాయి. అందుకే సచిన్ ఉత్తమ ప్రదర్శనల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను సిరీస్ ఫైనల్‌కు చేర్చారు లిటిల్ మాస్టర్.
ఇక ఫైనల్లోనూ సచిన్ 131 బంతుల్లో 134 పరుగులు చేసి మరోసారి శతకంతో మెరవడం వల్ల భారత్ కప్‌ను ఎగరేసుకుపోయింది. ఇందులో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు మాస్టర్ బ్లాస్టర్. అయితే ఇప్పుడు ఐపీఎల్ 13లో భాగంగా దుబాయ్ చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. ఆ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకున్నారు. షార్జాలోని ఆనాటి సిరీస్ జరిగిన స్టేడియంలో ఓ ఫొటో దిగి పోస్ట్ చేశారు.
"చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చాను. ఈ మైదానంలో నడుస్తుంటే సచిన్ అద్భుతాలు ఇంకా నా కళ్ల ముందే మెదలాడుతున్నాయి" అని వీవీఎస్ వ్యాఖ్య రాసుకొచ్చారు.
-
Coming back to Sharjah after a long time. Whenever I walk on this field memories of those two special 100s from @sachin_rt comes back to my mind, rushing like a #desertstorm pic.twitter.com/HJajtKmBR1
— VVS Laxman (@VVSLaxman281) August 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Coming back to Sharjah after a long time. Whenever I walk on this field memories of those two special 100s from @sachin_rt comes back to my mind, rushing like a #desertstorm pic.twitter.com/HJajtKmBR1
— VVS Laxman (@VVSLaxman281) August 30, 2020Coming back to Sharjah after a long time. Whenever I walk on this field memories of those two special 100s from @sachin_rt comes back to my mind, rushing like a #desertstorm pic.twitter.com/HJajtKmBR1
— VVS Laxman (@VVSLaxman281) August 30, 2020
సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది.