ETV Bharat / sports

ఎమ్​సీజీలో 'ది రికార్డ్​' వేడుకలకు ఆసీస్​ టీమ్ ​

author img

By

Published : Feb 10, 2021, 10:26 AM IST

'ది రికార్డ్'​ డాక్యుమెంటరీ లాంచింగ్​ను ఆనందంగా జరుపుకోవడానికి తమ మహిళల జట్టు మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​ను సందర్శిస్తుందని క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. వారితో పాటు చిత్ర నిర్మాతలు ఏంజెలా పిప్పోస్, నికోల్ మిన్చిన్​లు ఎమ్​సీజీకి రానున్నారు.

members of australian womens cricket team to return at mcg to celebrate the record
ఎమ్​సీజీలో 'ది రికార్డ్​' వేడుకలకు ఆసీస్​ టీమ్ ​

ఆస్ట్రేలియా మహిళల జట్టు గురువారం మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​(ఎమ్​సీజీ)ను సందర్శించనుందని క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. గతేడాది మహిళల టీ20 వరల్డ్​కప్​ సాధించి చరిత్ర సృష్టించిన టీమ్​పై.. 'ది రికార్డ్' పేరుతో తీసిన డాక్యుమెంటరీ లాంచింగ్ వేడుకలు జరుపుకోవడానికే టీమ్ సభ్యులు​ రానున్నారని వెల్లడించింది. అయితే ఈ సినిమా అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదల కానుంది.

'ది రికార్డ్'​ అనేది రెండు సిరీస్​లలో వస్తుంది. మైదానంలో వారు చూపిన అద్భుత ప్రదర్శన ఒకటి కాగా.. కప్​ సాధించడానికి వారు పడిన శ్రమ ఫలితంగా ఫైనల్​ వరకు ఎలా చేరారనేది ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.

గ్రౌండ్​కు వచ్చే వారిలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్​ లానింగ్, ఎల్లిస్ పెర్రీ, సోఫీ మోలినక్స్​, జార్జియా వేర్‌హామ్, మోలీ స్ట్రానో, టేలా వ్లామింక్​లతో పాటు నిర్మాతలు ఏంజెలా పిప్పోస్, నికోల్ మిన్చిన్​లు ఉన్నారు.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టుపై​ డాక్యుమెంటరీ

ఇదీ చదవండి: 'ఏ పని చేసినా హార్ట్​బీట్​ అమాంతం పెరిగేది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.