ETV Bharat / sports

'ఆ నిర్ణయంతోనే ఆసీస్​కు భారత్​ మాస్టర్ స్ట్రోక్' - అశ్విన్​ బౌలంగ్​ కోచ్​ ఆర్​ శ్రీధర్​

అడిలైడ్‌లో 36కే ఆలౌటైన టీమ్‌ఇండియా తిరిగి పుంజుకొని 2-1తో సిరీస్​ గెలవడం అద్భుతం. అయితే ఈ పరివర్తనకు కారణం ఏంటి? అసలు 36 పరుగులకే కుప్పకూలిన నాటి అర్ధరాత్రి ఏం జరిగింది? సహా పలు విషయాలను టీమ్​ఇండియా క్రికెటర్ అశ్విన్​, బౌలింగ్​ కోచ్​ శ్రీధర్​.. తమ కుట్టీ స్టోరీస్​ ఎపిసోడ్​-2లో పంచుకున్నారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..

bharat
భారత్​
author img

By

Published : Jan 23, 2021, 9:03 AM IST

అశ్విన్:

మిషన్ మెల్ బోర్న్ .. మూడు రోజుల ముందే అడిలైడ్​లో మొదలైంది. ఏదో కాలేజీ వీడ్కోలు కార్యక్రమంలా పాటలు పాడుకుంటూ విరాట్ కొహ్లీని సాగనంపే కార్యక్రమాన్ని టీం మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం వెళ్తున్నానని కోహ్లీ అందరితో చెబుతుంటే... మేం మాత్రం ఇప్పుడే 36కు ఆలౌట్ అయ్యాం. మమ్మల్ని వదిలేసి వెళ్లకు అన్నంత జాలిగా అందరం కొహ్లీని చూశాం. టీం ఈవెంట్ ఏర్పాటు చేయటానికి వెనుక కారణాలు చెప్పండి శ్రీధర్..?

శ్రీధర్:

ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే ముందు రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పాలి. 36కి ఆలౌటైన రోజు అర్ధరాత్రి 12.30కు ఏం చేస్తున్నారంటూ కోహ్లీ మెసేజ్ పెట్టాడు. ఇంత రాత్రివేళ మేసేజ్ ఏంటని నేను చూస్తున్న సమయంలో రవిశాస్త్రి, భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్​తో కలిసి కూర్చున్నాను మీరు రండి అన్నాడు. సరేనని వెళ్లాను. మిషన్ మెల్ బోర్న్ అనే మాట అప్పుడే విన్నాను. అప్పుడు రవిశాస్త్రి తీక్షణంగా మాకు అందరికీ ఓమాట చెప్పాడు. ఈ 36ను ఓ బ్యాడ్జ్ లా ధరించండి. ఈ 36 నెంబరే ఇదే జట్టును రేపు గర్వపడేలా చేస్తుంది అంటూ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. దాని తర్వాతే ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. విరాట్ కొహ్లీ స్థానంలో ఎవరైనా బ్యాట్స్ మన్ తీసుకుంటారు. మనం మాత్రం జడేజాను ఆడిస్తున్నాం అని రవిశాస్త్రి అన్నాడు. ఆ నిర్ణయం.. ఈ సిరీస్ మొత్తంలో హైలైట్​గా నిలిచే మాస్టర్ స్ట్రోక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అశ్విన్:

అవును అద్భుతమైన అర్ధశతకంతో జడేజా దాన్ని నిరూపించుకున్నాడు. కానీ ఎందుకు మ్యాచ్ ముందు రోజు ప్రాక్టీస్ రద్దు చేశారు.?

శ్రీధర్:

ఇది బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆలోచన. ఇప్పుడు ప్రాక్టీస్ చేయిస్తే ఫ్రస్టేషన్​లోకి వెళ్లిపోతారు. మెల్​బోర్న్ మ్యాచ్ గురించి అంత తీవ్రంగా ఆటగాళ్లు ఆలోచించకూడదని కోరుకున్నాడు. అతిగా ఆలోచిస్తే మెదడుపై భారంపడుతుంది తద్వారా తెలివిగా ఆడలేరని ఆ నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో జట్టులో ఎక్కువగా ఎడంచేతి వాటం ఆటగాళ్లను ఆడిద్దామని రవిశాస్త్రి నిర్ణయించారు. ఆసీస్ బౌలర్లు కుడిచేతి వాటం ఆటగాళ్లకు ఎక్కువ అలవాటుపడిపోయి ఉన్నారు కనుక ఎడం చేతి వాటం ఆటగాళ్లను దింపటం ద్వారా వాళ్ల లయను దెబ్బతీయటంతో పాటు మనకు ఎంతో కొంత సానుకూల ఫలితాలు వస్తాయని ఆశించారు. అంతే కాదు ప్రాక్టీస్ రద్దు చేయించి టీం డిన్నర్ ఏర్పాటు చేయాలని హోటల్ సిబ్బందిని కోరారు. నెగటివిటీ ఆటగాళ్లకు దరిచేరకుండా చిన్నపాటి ఆటలు, పాటలతో జట్టు సభ్యులంతా సరదాగా గడిపేలా ప్రణాళికలు రచించాం.

అశ్విన్:

చీటీలపై హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, క్రికెటర్ల పేర్లు రాయించి డంబ్​​షెల్​ ఆర్ట్స్​ ఆడించారు. రవిశాస్త్రి పేరును ఆయన చెప్పలేకపోవటం వల్ల జట్టంతా పగలబడి నవ్వుకున్నాం. పాటలు పాడాం. చాలా సరదాగా గడిపి మెల్​బోర్న్ టెస్టుకు సిద్ధమయ్యాం. టాస్ వేసే సమయం వచ్చింది. గడిచిన పదేళ్లుగా ప్రత్యేకించి మెల్​బోర్న్​లో టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకోవటం మ్యాచ్ గెలవటం పరిపాటి. అదే కొనసాగిద్దామని వెళ్లిన కొత్త కెప్టెన్ రహానె టాస్ ఓడిపోయాడు. టిమ్ పైన్ బ్యాటింగ్ తీసుకుంటామని చెప్పినప్పుడు కోచింగ్ స్టాఫ్ ఆలోచనలు ఏంటి?

శ్రీధర్:

ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాలి. టాస్ వేయటానికి పదినిమిషాల ముందు రవిశాస్త్రి నా దగ్గరకు వచ్చారు. మెల్​బోర్న్​లో మొదట ఫీల్డింగ్ చేసిన టీం గెలిచి ఎన్ని సంవత్సరాలైంది అని అడిగాడు. నాకు.. అసలు ఎందుకు అడిగాడో అర్థం కాలేదు. అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్న ఎదుర్కొన్న వాడిలా అలా నిలబడిపోయి ఆఖరి 5టెస్టులు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచిందని మాత్రం చెప్పాను. కానీ వికెట్ కాసింత తడిగా ఉండటం వల్ల వాళ్లు బ్యాటింగ్ తీసుకున్నా మనకి పర్లేదు అని అనుకున్నాం.

అశ్విన్:

మెల్​బోర్న్ స్టేడియం చాలా పెద్దది. టాస్ తర్వాత రవిశాస్త్రి వేగంగా డ్రెస్సింగ్ రూం వైపు వచ్చి యాష్ అని గట్టిగా అరిచాడు. నేనేమైందని కంగారుగా బయటికి వస్తే మొదటి పది ఓవర్లలోనే బౌలింగ్ చేయమని బిగ్గరగా చెప్పాడు. మెల్​బోర్న్​లో మొదటి పదిఓవర్లలో స్పిన్నర్ బౌలింగ్ చేయటేమేంటని నేను ఆశ్చర్యపోయాను. పిచ్ తడిగా ఉంది. స్పిన్​ తిరుగుతుంది. నేను రహానెకు చెప్పాను అని గట్టిగా అనేసి వెళ్లిపోయాడు. 6-8 ఓవర్లు గడిచాయి బుమ్రాకు బౌలింగ్ బాగా పడుతోంది. మరో వైపు తొలి మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ ఉన్నాడు. బంతినాకిచ్చారు. మొదటి బాల్ లబుషేన్​కు విసరగానే అనూహ్యంగా బౌన్స్ అయ్యి అతని మొహం పక్కనుంచి వెళ్లటంతో నాకు పరిస్థితి అర్థమైపోయి పూర్తిగా ధైర్యమొచ్చింది.

శ్రీధర్:

మెల్​బోర్న్​లో కోచ్ బాక్స్ అంటే తిరుపతి కొండ ఎక్కినంత కష్టపడాలి. వెయ్యి మెట్లెక్కితే గానీ రూంకి వెళ్లలేమన్నట్లు ఉంటుంది. నేను వెళ్లగానే అశ్విన్​కు త్వరగా బౌలింగ్ ఇచ్చేయమని రహానెకు చెప్పాను అని రవిశాస్త్రి గట్టిగా చెపుతున్నారు. కచ్చితంగా స్మిత్ వికెట్ కూడా ఆశ్వినే తీస్తాడని ధైర్యంగా ఉండొచ్చని మాకు చెప్పాడు. మొదటి బంతిని నువ్వు(అశ్విన్) బౌన్స్ చేయగానే నాకు పంత్ గుర్తొచ్చాడు. కఠినపరిస్థితుల్లో సిరీస్​లో మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. స్పిన్​లో వచ్చే బౌన్స్​ను పట్టుకోగలడా అనే సందేహం నాకు వచ్చింది. సాహాకు చెప్పి పంత్​ను వికెట్ల నుంచి కొన్ని అడుగులు వెనక్కి వెళ్లి కీపింగ్​ చేయమని చెప్పాం. అలా లంచ్ సమయానికి మూడు వికెట్లు తీయగలిగాం.

అశ్విన్:

లంచ్​కే నాలుగు వికెట్లు పడాల్సింది. వర్చువల్ ఐ టెక్నాలజీ మాయతో లబుషేన్ బతికిపోయాడు. మన బ్యాటింగ్ మొదలయ్యాక అజింక్యా రహానె చేసిన సెంచరీని మాత్రం మరిచిపోలేం. చాలా కాలంపాటు గుర్తుండిపోయే అద్భుతమైన శతకమది.

శ్రీధర్:

మెల్​బోర్న్​లో రెండో రోజు ఆకాశం మేఘావృతమైంది. పరిస్థితులు భారత బ్యాట్స్​మన్​కు అత్యంత కఠినంగా మారాయి. నేను ఈ మధ్య కాలంలో చూడని విధంగా ఆసీస్ పేస్ బౌలర్లు విజృంభించారు. అద్భుతమైన పేస్ బౌలింగ్ దాడి అది. అలాంటి పరిస్థితుల్లో రహానె ఆడిన తీరు చిరస్మరణీయం. అసలు బ్యాట్ ఊపే పనే లేదన్నట్లు అతనాడిన సాలిడ్ డిఫెన్స్ అద్భుతం అంతే.

అశ్విన్:

ఖైదీ సినిమాలో కార్తీకి రెండు చేతులకు బేడీలు వేసినా లారీ నడిపినట్లు చాలా బ్యాలెన్స్​తో రహానె బ్యాటింగ్ చేశాడు. విహారి, రహానె భాగస్వామ్యం మ్యాచ్​ను నిలబెట్టింది. జడేజా సూపర్ షో తో పాటు రెండో ఇన్నింగ్స్​లో సిరాజ్ బౌలింగ్​తో అదరగొట్టాడు.

శ్రీధర్:

సిరాజ్ మొదటి నుంచి నాకు బాగా పరిచయం. ఎప్పుడూ ఫోన్ చేసి.. నన్ను ఎప్పుడు టీం లోకి పిలుస్తారు సర్ అని అడిగేవాడు. ఇండియా ఏ కు ఎంపికయ్యాక తరచూ ఇదే ప్రశ్నలతో వేధించేవాడు. సెలక్టర్లు పిలిస్తే కచ్చితంగా వస్తావంటూ తప్పించుకుని తిరిగేవాడిని. అలాంటి వాళ్ల నాన్న గారు చనిపోయినా ఆయన కోరిక మేరక ఉండి ఆడిన తీరు, చేసిన ప్రదర్శన నిజంగా సిరాజ్​కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

అశ్విన్:

రెండో ఇన్నింగ్స్​లో ఉమేష్ యాదవ్​కు గాయమైనా.. ఆటగాళ్ల సమష్ఠి ప్రదర్శనతో మెల్​బోర్న్​ను చుట్టేశాం. సిరీస్​ను 1-1తో సమం చేసి చాలా మంది ప్రశ్నలకు తిరుగులేని సమాధానం ఇచ్చాం. ఇంతకంటే గొప్ప మ్యాచ్ ఉంటుందా అనుకున్న వాళ్లకి సిడ్నీ టెస్టులో చేసిన పోరాటంతో పెద్ద షాకిచ్చాం. తర్వాతి ఆర్టికల్​లో ఆ విశేషాలు తెలుసుకుందాం.

ఇదీ చూడండి : 'అడిలైడ్ టెస్ట్ నాకు ఆఖరిది అనుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.