వరల్డ్‌కప్ ఫేవరెట్లలో భారత్ నిలవడానికి బలమైన బౌలింగ్ లైనప్ ఒక కారణమని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించాడు. ఇటీవల సిరీస్‌లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా సైతం పుంజుకుంటుందన్నాడు.
"ప్రపంచకప్‌నకు భారత్, ఇంగ్లండ్‌లు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ అతి కష్టం మీద డ్రాగా ముగించింది. మరోవైపు స్వదేశంలో జరిగిన రెండు ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్ కోల్పోయింది. అయితే వీటికి టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాకు అవకాశాలు మెరుగయ్యాయి."
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, మెక్‌గ్రాత్
అన్ని విభాగాల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు పటిష్ఠంగా మారాయని.. భారత క్రికెట్ జట్టు సారథి కోహ్లీ ఓ గొప్ప ఆటగాడంటూ మెక్‌గ్రాత్ కితాబిచ్చాడు. విరాట్‌ను అసాధారణ క్రికెటర్‌గా పేర్కొంటూ...అతని కెరీర్ ముగిసే సమయానికి సచిన్ తెందూల్కర్, బ్రయాన్ లారా సరసన చరిత్రలో నిలిచిపోతాడని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో భారత్ బౌలర్లు బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలతో పేస్ విభాగం కూడా దృఢంగా ఉందన్నాడీ మాజీ పేసర్.