హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. భాగ్యనగరంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ నిర్వహించాలన్న కేటీఆర్ విజ్ఞప్తికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ మద్దతు ప్రకటించారు. బయోబబుల్ ఏర్పాటు చేయటంతో పాటు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ నిర్వహించే సత్తా హైదరాబాద్‌కు ఉందని ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.
-
I strongly support the appeal by @ktrtrs. Hyderabad is absolutely capable in handling and conducting @IPL as per @BCCI’s directives and preparing a bio-secure bubble https://t.co/h3COGQnRwp
— Mohammed Azharuddin (@azharflicks) February 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I strongly support the appeal by @ktrtrs. Hyderabad is absolutely capable in handling and conducting @IPL as per @BCCI’s directives and preparing a bio-secure bubble https://t.co/h3COGQnRwp
— Mohammed Azharuddin (@azharflicks) February 28, 2021I strongly support the appeal by @ktrtrs. Hyderabad is absolutely capable in handling and conducting @IPL as per @BCCI’s directives and preparing a bio-secure bubble https://t.co/h3COGQnRwp
— Mohammed Azharuddin (@azharflicks) February 28, 2021
మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలో తక్కువ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా కారణంగా 2020లో యూఏఈలో ఐపీఎల్ నిర్వహించారు. 2021లో స్వదేశంలో లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
కొవిడ్ పూర్తిస్థాయిలో తగ్గకపోవటంతో ఈసారి చెన్నై, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతాతో పాటు అహ్మదాబాద్లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ముంబయిలో కూడా నిర్వహించనున్నారు. ముంబయిలో మ్యాచ్‌లు వీలు కాని పక్షంలో హైదరాబాద్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్, జైపూర్, మొహాలీలను పక్కన పెట్టారు.
ఇదీ చదవండి: అట్టహాసంగా లింగమంతుల జాతర ప్రారంభం.. బారులుతీరిన భక్తులు