ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులోకి తిరిగొచ్చారు. దుబాయ్‌లో వీరికి సహచర ఆటగాళ్ల నుంచి ఘనస్వాగతం లభించింది. దాదాపు సంవత్సరం నిషేధం తర్వాత మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మార్చి నెలతో వీరిపై ఉన్న నిషేధం ముగుస్తుంది.
ప్రస్తుతం ఆసిస్ జట్టు దుబయ్‌లో పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ గెలిచిన కంగారూ జట్టు అదే ఊపుతో పాక్‌పై సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.
"ఘనస్వాగతం పలికినందుకు సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. భారత్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. పాకిస్థాన్‌తో కూడా అలా ఆడతారని భావిస్తున్నా. జట్టు విలువలే మాకు ముఖ్యం. యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం.
వార్నర్, ఆసిస్ బ్యాట్స్‌మెన్
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో బాల్ టాంపరింగ్ వివాదంతో వార్నర్, స్మిత్‌కు ఐసీసీ ఏడాది సస్పెన్షన్ విధించింది. ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ కూడా 9 నెలల నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
"మేము సరైన దారిలో ఉన్నామని భావిస్తున్నాం. వచ్చే ప్రపంచకప్, యాషెస్ సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.
స్మిత్, ఆస్ట్రేలియా క్రికెటర్
పాకిస్థాన్‌తో జరిగే చివరి రెండు వన్డేలు ఆడేందుకు వార్నర్, స్మిత్ సిద్ధమైనా.. యాజమాన్యం మాత్రం వారు ఐపీఎల్‌తో పునరాగమనం చేయాలని అనుకుంటోంది.
ఇవీ చూడండి.."నాలుగో స్థానానికి ధోనియే కరెక్ట్"