ETV Bharat / sports

'స్థానం ఉంది కదా అని హాయిగా కూర్చోలేం' - విఫల ప్రదర్శనపై కేఎల్ రాహుల్

కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బందిపడుతోన్న టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్​తో జరిగిన మొదటి వన్డేలో సత్తాచాటాడు. తాజాగా రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ తాను విఫలమవడానికి గల కారణాన్ని తెలిపాడు.

KL Rahul
రాహుల్
author img

By

Published : Mar 25, 2021, 9:57 PM IST

మూడు నెలలు క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్​లో విఫలమయ్యానని టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అంటున్నాడు. తన సన్నద్ధతపై విశ్వాసం వల్లే మొదటి వన్డేలో పుంజుకోగలిగానని పేర్కొన్నాడు. రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన ఇతడు పలు విషయాలు వెల్లడించాడు.

"నిరంతరం మ్యాచ్​లు ఆడుతుంటే నా లయ బాగుంటుందని అనిపిస్తుంది. నాకు ఇష్టమైనంత గేమ్‌టైమ్‌ దొరక్కపోతే ఇబ్బంది పడతా. నా మదిలో అదే ఉండిపోతుంది. అందుకే సన్నద్ధమయ్యేందుకు ఏదో ఒక దారి వెతకాలి. అది శిక్షణైనా కావొచ్చు ఓపెన్‌ నెట్‌ సెషన్‌ అయినా కావొచ్చు. అందుకే నేను సన్నద్ధమయ్యేందుకు సాధ్యమైనంత ప్రయత్నిస్తా. కానీ మ్యాచ్‌లు ఆడటానికి ఏదీ సాటి రాదు."

-రాహుల్, టీమ్ఇండియా క్రికెటర్

రిషభ్‌ పంత్, ఇషాన్‌ కిషన్‌ వంటి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ పోటీకి రావడంపై రాహుల్‌ స్పందించాడు. "భారత జట్టులో ఉన్నప్పుడు పోటీ ఎక్కువగా ఉంటుందని తెలుసు. ఏదో ఒక స్థానం మనకుంటుందని హాయిగా కూర్చోలేం. మనకెప్పుడూ సవాళ్లు ఎదురవుతాయి. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. అందుకే ముందుకెళ్లేందుకు మరింత శ్రమించాలి. ఆటను మెరుగుపర్చుకోవాలి. అవకాశం దొరికినప్పుడు రెండు చేతులతో అందిపుచ్చుకోవాలి" అని రాహుల్‌ అన్నాడు.

"అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్​తో సతమతమవడం సహజమే. ఇదీ ప్రయాణంలో భాగమే. అందరికీ ఎదురవుతుంది. అందుకే మరీ ఆందోళన పడను. రిజర్వు బెంచీపై ఉన్నప్పుడు ఆటగాడిగా నిరాశ పడతాం. మూడు, నాలుగు నెలల తర్వాత జట్టులోని మిగతావాళ్లలా ఆడాలనుకుంటాం. అలా జరగకపోతే దానిని అంగీకరించాలి. మ్యాచ్‌కు సన్నద్ధత స్థాయికి తగినట్టు ఉందో లేదో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేనూ అలాగే చేస్తా."

-రాహుల్, టీమ్ఇండియా క్రికెటర్

"దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాగా ఆడకపోతే నిరాశపడతాం. బాగా ఆడి దేశానికి విజయాలు అందిస్తూనే ఉండాలి. అయితే ప్రతిసారీ ఆ పని చేయలేకపోవచ్చని అంగీకరించాలి. రెండున్నరేళ్లుగా నాకు అప్పజెప్పిన ప్రతి పాత్రను పోషించా. జట్టును ముందుకు నడిపా. అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు నా ప్రక్రియ, అభిరుచి, అంకితభావాన్ని ప్రశ్నించుకోను. రెండు, మూడు చెత్త ప్రదర్శనలను అతిగా విశ్లేషించుకోను. అన్నీ మన నియంత్రణలో ఉండవని గుర్తుంచుకోవాలి" అని రాహుల్‌ తెలిపాడు.

ఇవీ చూడండి: భారత్-ఇంగ్లాండ్: కోహ్లీసేన జోరును ఇంగ్లాండ్ ఆపగలదా?

'ఈ సమయంలో భారత్-పాక్ సిరీస్​ చాలా ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.