ETV Bharat / sports

'రోహిత్​శర్మ​ గాయంపై స్పష్టత లేదు' - విరాట్​ కోహ్లీ వార్తలు

రోహిత్​ గాయం తీవ్రతపై సరైన సమాచారం, స్పష్టత లేదని చెప్పాడు భారత జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. హిట్​మ్యాన్​ ఎందుకు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా రాలేదో తనకు తెలియదన్నాడు. తొడకండరాల గాయం వల్ల ఇప్పటికే హిట్​మ్యాన్​ ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు.

virat kohli latest news
రోహిత్​ గాయంపై స్పష్టత లేదు: విరాట్​ కోహ్లీ
author img

By

Published : Nov 26, 2020, 7:24 PM IST

Updated : Nov 26, 2020, 7:44 PM IST

భారత ఓపెనర్​ రోహిత్​శర్మ​ గాయంపై తాజాగా స్పందించాడు టీమ్​ఇండియా సారథి విరాట్​కోహ్లీ. ఆస్ట్రేలియా వన్డే సిరీస్​ ముంగిట మీడియాతో వర్చువల్​గా మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్​ ఆసీస్​ పర్యటనకు దూరం కావడంపై తన అభిప్రాయం తెలిపాడు విరాట్.

" దుబాయ్​లో సెలక్షన్​ మీటింగ్​కు రెండ్రోజుల ముందు మాకు ఒక మెయిల్​ వచ్చింది. ఐపీఎల్​లో గాయపడటం వల్ల రోహిత్​ సెలక్షన్​కు అందుబాటులో ఉండడని అందులో ఉంది. కోలుకునేందుకు అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని దానిలో పేర్కొన్నారు. గాయం వల్ల కలిగే నష్టాలను రోహిత్​కు చెప్పామని.. వాటిని అతడు అర్థం చేసుకునే సెలక్షన్​కు అందుబాటులో ఉండట్లేదని ఆ లేఖలో ప్రస్తావించారు. అనంతరం ఐపీఎల్​ ఫైనల్లో బరిలోకి దిగిన రోహిత్​.. ఆ తర్వాత విమానంలో ఆస్ట్రేలియాకు వస్తాడని అందరం భావించాం. అతడు ఏ కారణాలతో ఆసీస్​కు రాలేదనేది మాకు సమాచారం లేదు. అయితే ఆ తర్వాత అతడు ఎన్​సీఏలో ఉన్నట్లు మాకు అధికారికంగా తెలిసింది. ఫిట్​నెస్​ ట్రైనింగ్​లో ఉన్నాడని.. డిసెంబర్​ 11న మరోసారి ఫిట్​నెస్​ పరీక్షిస్తారని అధికారులు స్పష్టం చేశారు.అయితే ఈ అంశాలన్నింటిపై స్పష్టమైన సమాచారం, పూర్తి స్పష్టత లేదు".

-- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా సారథి

రోహిత్​ శర్మ ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అయితే ప్రస్తుతం హిట్​మ్యాన్​ బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీ(ఎన్​సీఏ)లో కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్​నెస్​ సాధించడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టొచ్చని ఇటీవలే బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ గాయం నుంచి కోలుకున్నా.. 14 రోజుల క్వారంటైన్​ నిబంధన వల్ల రోహిత్​ టెస్టుల్లో ఆడలేడని స్పష్టం చేశాయి.

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబర్‌ 27న సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది.

Last Updated : Nov 26, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.