ETV Bharat / sports

అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం పొడిగింపు - Kumar Sangakkara news

ఎమ్​సీసీ అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం, మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సదరు క్లబ్ ప్రకటన చేసింది.

కుమార సంగక్కర పదవీకాలం పెంపు
కుమార సంగక్కర
author img

By

Published : May 6, 2020, 7:34 PM IST

ప్రతిష్ఠాత్మక మెరిల్​బోన్ క్రికెట్​ క్లబ్​(ఎమ్​సీసీ) అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర. ఈ మేరకు అతడి పదవీకాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పెంచాలని నిర్ణయించినట్లు ఎంసీసీ ప్రకటించింది. దీంతో రెండేళ్లు పదవిలో ఉండనున్న నాలుగో వ్యక్తిగా సంగక్కర నిలవనున్నాడు.

MCC
మెరిల్​బోన్ క్రికెట్ క్లబ్

"సాధారణంగా ఎమ్​సీసీ అధ్యక్షుడి పదవీకాలం ఏడాదే ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో దానిని పొడిగించొచ్చు. గతంలో ఇలానే లార్డ్ హావ్​కే(1914-18), స్టాన్లీ క్రిస్టోపెరెన్స్(1939-45) కొనసాగారు" -ఎమ్​సీసీ ప్రకటన

గతేడాది అక్టోబరులో ఎమ్​సీసీ అధ్యక్షుడిగా ఎంపికైన సంగక్కర.. ఈ పదవి చేపట్టిన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.