ఐపీఎల్లో స్లో ఓవర్ రేటుకు మూల్యం చెల్లించుకున్నాడు విరాట్ కోహ్లీ. శనివారం బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ నమోదైంది. ఫలితంగా కోహ్లీకి రూ.12లక్షలు జరిమానా పడింది. ఈ మ్యాచ్‌తో తొలి విజయం అందుకున్న కోహ్లీ మొదటిసారి మ్యాచ్ ఫీజులో కోత ఎదుర్కొన్నాడు.
- ఇంతకు ముందు రోహిత్ శర్మకు ఇదే తరహాలో ఫైన్ పడింది. ముంబయి ఇండియన్స్- కింగ్స్‌లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు తరఫున స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఆ జట్టు సారథి రోహిత్‌కు జరిమానా ఎదుర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో... స్లో ఓవర్ రేట్ కారణంగానే రాజస్థాన్ సారథి అజింక్యా రహానేకు జరిమానా విధించారు.