ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి పదో ర్యాంకులో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (687) తొమ్మిదవ స్థానానికి చేరుకోవడం వల్ల కోహ్లీ (673 పాయింట్లు) ఒక స్థానం పడిపోయాడు. వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ (2), రోహిత్ శర్మ(11) వారి స్థానాలను కాపాడుకున్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ 10 స్థానాలు ఎగబాకి 16కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో, దక్షిణాఫ్రికాకు చెందిన డసేన్ 15, 21 స్థానాలు ఎగబాకి కెరీర్లో ఉత్తమంగా 23 మరియు 37 వ స్థానాలను ఆక్రమించారు.
ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్ఘాన్ క్రికెటర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇటీవలే వన్డేల్లో అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో 12వ స్థానంలో నిలిచాడు.
ఇదీ చూడండి.. 'ప్రపంచకప్ విజేతగా నిలవడమే లక్ష్యం'