వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలు సాధించాడు. ఒకే జట్టుపై... అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా, అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2000 పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
కోహ్లీ.. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన జావేద్ మియాందాద్(1930 పరుగులు) పేరిట ఉంది. దానిని విరాట్ అధిగమించాడు.
అదే విధంగా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఒక జట్టుపై 2000 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు కోహ్లీ. కేవలం 34 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ ఈ ఘనత సాధించాడు. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(37 ఇన్నింగ్స్-ఆస్ట్రేలియా), సచిన్ తెందూల్కర్(40 ఇన్నింగ్స్-ఆస్ట్రేలియా) ఉన్నారు.
ఇది చదవండి: 'రెండోసారి మోకాలి శస్త్రచికిత్స కష్టమైన విషయం'