టీమిండియాకు కోచ్ ఎంపిక చేసే విషయంపై కెప్టెన్ కోహ్లీ అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పారు భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కపిల్‌దేవ్.
"కోచ్ రవిశాస్త్రి కొనసాగితే బాగుంటుందనేది కోహ్లీ అభిప్రాయం. అతడిలానే అందరి మాటల్ని మేం గౌరవిస్తాం. ఇదేమి కష్టమైన పని కాదు. శక్తి మేర పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం." -కపిల్ దేవ్, టీమిండియా మాజీ కెప్టెన్.
ఇదే విషయంపై స్పందించిన మరో సభ్యురాలు శాంతా రంగస్వామి.. తుది నిర్ణయం మాత్రం కమిటీదేనని అన్నారు. భారత జట్టుకు కోచ్‌గా అత్తుత్యమ వ్కక్తినే నియమిస్తామని స్పష్టం చేశారు.
"విరాట్ కెప్టెన్ మాత్రమే. అతడి అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. కానీ అంతిమ నిర్ణయం మాత్రం ముగ్గురు సభ్యుల కమిటీదే. అందరి అభిప్రాయలపై ఓ అంచనాకు వచ్చి ఆ తర్వాత కోచ్‌గా ఎవరిని ఎంపిక చేయాలో ఖరారు చేస్తాం." -శాంతా రంగస్వామి, క్రికెట్ సలహా మండలి సభ్యురాలు.
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ క్రికెట్ ఎడ్వైజరీ కమిటీ ఈ నెలలో ఇంటర్వూలు నిర్వహించనుంది.