అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. టెస్టు ర్యాంకింగ్స్‌ను మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(928 పాయింట్లు).. ఈ ఏడాదిని అగ్రస్థానంతోనే ముగించాడు. అజింక్య రహానే ఏడో ర్యాంకుకు దిగజారగా.. చెతేశ్వర్ పుజారా 791 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పదిలపర్చుకున్నాడు.
ఇటీవలే జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆకట్టుకున్న రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్.. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి దూసుకొచ్చారు. మయాంక్ 12వ స్థానానికి రాగా.. రోహిత్ శర్మ 15వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో శతకంతో ఆకట్టుకున్న బాబర్ అజామ్ ఆరో స్థానానికి చేరాడు.
బౌలర్ల విభాగంలో బుమ్రా ఆరో స్థానంలో నిలవగా, ఆసీస్ పేసర్ కమిన్స్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. విండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్ నెంబర్ వన్‌లో ఉన్నాడు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 360 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా(216), పాకిస్థాన్(80), శ్రీలంక(80), న్యూజిలాండ్(60), ఇంగ్లాండ్(56) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: 'ముందు మీ దేశ భద్రత గురించి ఆలోచించండి'