ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్- రెండో స్థానానికి కోహ్లీ​​

author img

By

Published : Dec 15, 2020, 7:17 PM IST

Updated : Dec 15, 2020, 8:24 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) మంగళవారం టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. బ్యాటింగ్​ జాబితాలో స్టీవ్​ స్మిత్​ తొలిస్థానంలో ఉండగా.. ఒకస్థానాన్ని మెరుగుపరుచుకున్న కోహ్లీ రెండోస్థానానికి చేరాడు. బౌలింగ్​లో పాట్​ కమిన్స్​.. ఆల్​రౌండర్​ జాబితాలో బెన్​స్టోక్స్​ తొలిస్థానాల్లో నిలిచారు.

Kohli climbs to 2nd spot; Pujara, Rahane also feature in top-10 in ICC Test ranking for batsmen
ఐసీసీ ర్యాంకింగ్స్: రెండోస్థానానికి చేరిన కోహ్లీ​​

టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. బ్యాటింగ్​ ర్యాంకుల్లో.. టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. 886 పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​.. 911 పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఛెతేశ్వర్​ పుజారా ఏడోస్థానంలో ఉండగా.. అజింక్య రహానె 10వ స్థానానికి చేరుకున్నాడు.

బ్యాట్స్​మెన్​ జాబితాలో న్యూజిలాండ్​కు చెందిన కేన్​ విలియమ్సన్​ మూడోస్థానానికి పడిపోయాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో మార్కస్​ లబుషేన్​, ఐదోస్థానంలో బాబర్​ ఆజామ్​, ఆరోస్థానంలో డేవిడ్​ వార్నర్​లు ఉన్నారు. ​

బౌలింగ్​ ర్యాంకులు

బౌలింగ్​ ర్యాంకుల్లో టీమ్​ఇండియా ఆటగాళ్లు జస్​ప్రీత్​ బుమ్రా (779), రవిచంద్రన్​ అశ్విన్​ (756) ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకుని 8, 10వ స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పాట్​ కమిన్స్ (904) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లాండ్​ బౌలర్​ స్టువర్ట్​ బ్రాడ్​ (845), న్యూజిలాండ్​కు చెందిన నీల్​ వాగ్నర్(840)​లు ఉన్నారు. ​

స్టోక్స్​దే అగ్రస్థానం

ఆల్​రౌండర్​ జాబితాలో టీమ్​ఇండియా ఆటగాళ్లైన రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​లు టాప్​-10లో చోటు దక్కించుకున్నారు. జడేజా (397) మూడో స్థానంలో ఉండగా.. 281 పాయింట్లతో అశ్విన్​ ఆరోస్థానానికి చేరుకున్నాడు. 446 పాయింట్లతో ఇంగ్లాండ్​కు చెందిన బెన్​స్టోక్స్​ అగ్రస్థానంలో నిలిచాడు.

Last Updated : Dec 15, 2020, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.