ETV Bharat / sports

బయోసెక్యూర్​ వాతావరణంలో ఇంగ్లాండ్​ X విండీస్​ మ్యాచ్​

author img

By

Published : Jul 8, 2020, 7:01 AM IST

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ టోర్నీలు ఆగిపోయి నాలుగు నెలలు కావస్తోంది. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​ జరపాలని ప్రణాళికను సిద్ధం చేసింది ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో క్రీడాటోర్నీలు ఎలా నిర్వహిస్తారని పలువురు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేసినా.. బయోసెక్యూర్​ వాతావరణంలో సిరీస్​లను నిర్వహిస్తామని ఈసీబీ స్పష్టం చేసింది. నేటి నుంచి ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య టెస్టు సిరీస్​ ప్రారంభం కానున్న తరుణంలో ఇరు దేశాల క్రికెటర్లు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Know Everything About Bio Secure Stadium As Cricket Resumes
బయోసెక్యూర్​ వాతావరణంలో క్రికెట్​ మ్యాచ్​లు సాధ్యమేనా?

అంతర్జాతీయ క్రికెట్‌ ఆగిపోయి దాదాపు నాలుగు నెలలు అయింది. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికీ కొన్ని దేశాల్లో సాధన చేసేందుకు ఆటగాళ్లకు అనువైన పరిస్థితులు లేవు. అలాంటిది ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ ఏకంగా మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు సిద్ధమయ్యాయి. బయో సెక్యూర్‌ వాతావరణంలో సౌతాంప్టన్‌ వేదికగా నేటి (జులై 8) నుంచి తొలి మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. బంతిపై ఉమ్మి రాయడం నిషేధం, సంబరాలపై ఆంక్షల నేపథ్యంలో సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బయోసెక్యూర్‌ అంటే?

క్రికెటర్లకు ఒకర్నుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా లేదా అసలు వైరస్‌ ఉనికే లేకుండా ఉంచేందుకు బయోసెక్యూర్‌ వాతావరణం సృష్టిస్తున్నారు. దీంతో మ్యాచులు జరిగే ప్రాంతంలో వైరస్‌ ఉండదని అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ), ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు(ఈసీబీ) భావిస్తున్నాయి.

Know Everything About Bio Secure Stadium As Cricket Resumes
ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు, వెస్టిండీస్​ క్రికెట్ బోర్డు

కట్టుదిట్టంగా ప్రణాళిక

ఈ వాతావరణాన్ని సృష్టించేందుకు ఈసీబీ కట్టుదిట్టంగా ప్రణాళిక రూపొందించింది. మూడు వేదికల్లో జరగాల్సిన సిరీస్‌ను రెండింటికే పరిమితం చేసింది. తొలి టెస్టు సౌతాంప్టన్‌, మిగతా రెండు టెస్టులు మాంచెస్టర్‌లో నిర్వహించనుంది. ఇక్కడ స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. అక్కడికి ఇతరులు రాకుండా నిబంధనలు జారీ చేస్తారు. క్రికెటర్లు సైతం బయటకు వెళ్లకుండా నిఘా ఉంటుంది. పర్యాటక వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లాండ్‌ చేరుకుని మూడు వారాలు క్వారంటైన్‌లో ఉంది. మ్యాచ్‌ అధికారులు, బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సిబ్బంది సైతం ఈసీబీ నిబంధనలు పాటించారు.

మ్యాచ్​లు జరిగే సమయంలో ఆటగాళ్లు ఒకరినొకరు ముట్టుకోకూడదు. సంబరాలు చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే జరుగుతున్న సన్నాహక మ్యాచ్​లలో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ఈ పద్ధతులు పాటిస్తున్నారు. వికెట్లు తీసినప్పుడు మోచేతుల్ని అభివాదం చేసుకుంటున్నారు. బంతిపై లాలాజలం వాడటం లేదు. అండర్సన్‌ వంటి పేసర్లు ఎక్కువగా హ్యాండ్‌ శానిటైజర్లు వాడారు.

సందేహాలు

ఈసీబీ బయో సెక్యూర్‌ వాతావరణంపై టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ సందేహాలు వ్యక్తం చేశాడు. ఈ విధానం సత్యదూరంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. "ఈసీబీ మాట్లాడుతున్న బయోసెక్యూర్‌ కష్టమే. క్రికెట్‌ సిరీసులు నిర్వహించేందుకు వారు తహతహలాడుతున్నారు. ఎందుకంటే వారికి మరో మార్గం లేదు. ఒకవేళ వారు బయోబబుల్‌ సృష్టించి సిరీస్‌ నిర్వహించినా ఇప్పుడున్న క్యాలెండర్‌ ప్రకారం అన్ని చోట్లా, అందరికీ అలా చేయడం కుదరదు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. క్రికెట్లో ఎంతోమంది జోక్యం ఉంటుంది" అని ద్రవిడ్​ అన్నాడు. మరోవైపు టీమ్​ఇండియాతో సిరీస్‌కు దక్షిణాఫ్రికా బోర్డు ఇలాగే చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇదీ చూడండి... బయో సెక్యూర్​ టెస్టు.. ఇంగ్లాండ్​ బోర్డుపై ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.