న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్. 5-0 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన గెల్చుకోవడంలోనూ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ర్యాంకింగ్స్‌లోనూ మెరుగుపడ్డాడు. ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ జాబితాలో కెరీర్లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు.
ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజమ్ తొలిస్థానంలో ఉండగా, టీమిండియా కెప్టెన్ కోహ్లీ తొమ్మిదిలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ.. టాప్ 10లోకి దూసుకెళ్లాడు.
భారత నుంచి బ్యాటింగ్ విభాగంలో శ్రేయస్ అయ్యర్(55), మనీశ్ పాండే(58)... బౌలింగ్‌లో బుమ్రా(11), చాహల్(30), శార్దుల్ ఠాకుర్(57), నవదీప్ సైనీ(71), రవీంద్ర జడేజా(76) ర్యాంకుల్లో ఉన్నారు.
కివీస్ నుంచి కెప్టెన్ విలియమ్సన్(16), టిమ్ సెఫర్ట్(34), రాస్ టేలర్(39), ఇష్ సోదీ(13) స్థానాల్ని సొంతం చేసుకున్నారు.