తన తొలి వన్డేలోనే సెంచరీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని తెలిపాడు టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. కానీ తొలి టెస్టు కంటే వన్డేలో చాలా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగానని అన్నాడు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
"టెస్టు అరంగేట్రం కంటే వన్డే అరంగేట్రంలో చాలా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగా. కానీ నా తొలి వన్డేలోనే సెంచరీ చేస్తానని అస్సలు అనుకోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాత్రమే అనుకున్నా. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసి రావడం నా నమ్మకాన్ని పెంచింది."
-రాహుల్, టీమ్ఇండియా క్రికెటర్
2016లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రాహుల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 115 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లు ఒక సిక్సు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా అలవోక విజయం సాధించింది. రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
-
https://t.co/n2IgRsA12t pic.twitter.com/LC9xyyRPKy
— K L Rahul (@klrahul11) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">https://t.co/n2IgRsA12t pic.twitter.com/LC9xyyRPKy
— K L Rahul (@klrahul11) May 11, 2020https://t.co/n2IgRsA12t pic.twitter.com/LC9xyyRPKy
— K L Rahul (@klrahul11) May 11, 2020