ETV Bharat / sports

రిసెప్షన్​లో భార్యతో క్రికెట్ ఆడిన మిస్టరీ స్పిన్నర్

కోల్​కతా నైట్​రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి నేహా ఖెడెకర్​ను వివాహమాడాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసింది కేకేఆర్ ఫ్రాంచైజీ. ఇందులో రిసెప్షన్ వేదికపై క్రికెట్ ఆడుతూ కనిపించిందీ జంట.

author img

By

Published : Dec 14, 2020, 2:04 PM IST

KKR mystery spinner Varun Chakravarthy playing cricket in his marriage reception
రిసెప్షన్​లో భార్యతో క్రికెట్ ఆడిన మిస్టరీ స్పిన్నర్

కోల్​కతా నైట్​రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి నేహా ఖెడెకర్​ను వివాహమాడాడు. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, పలువురు బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నైట్​రైడర్స్ ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఓ వీడియోలో వరుణ్ రిసెప్షన్ వేదికపై అతని సతీమణితో క్రికెట్ ఆడుతూ కనిపించాడు.

వరుణ్ బంతులు వేయగా అతడి భార్య బ్యాటింగ్ చేసింది. ఈ వీడియోను "వివాహ బంధంతో భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వరుణ్, నేహాలకు అభినందనలు" అని క్యాప్షన్ ఇచ్చి నెట్టింట పోస్ట్ చేసింది కేకేఆర్.

ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్​కు ఆడిన వరుణ్ 6.84 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ గాయం కారణంగా పర్యటనకు దూరమయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.