ETV Bharat / sports

పొలార్డ్​ స్టన్నింగ్​ క్యాచ్​- మలుపు తిరిగిన మ్యాచ్​ - srilanka vs westindies

వెస్టిండీస్​-శ్రీలంక తొలి వన్డేలో విండీస్​ కెప్టెన్ కీరన్ పొలార్డ్​ రెండు ప్రత్యేకమైన వికెట్లు తీశాడు. అందులో ఒకటి కళ్లు చెదిరే క్యాచ్​ కాగా.. మరొకటి అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్​గా ఔట్​ చేశాడు. ఈ మ్యాచ్​లో కరీబియన్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

kieron-pollards-best-catch-ever-in-the-odi-vs-sri-lanka
పొలార్డ్​ స్టన్నింగ్ క్యాచ్- లంకపై విండీస్​ విజయం​
author img

By

Published : Mar 11, 2021, 11:58 AM IST

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ అద్భుతం చేశాడు. కీరన్​ రెండు ప్రత్యేక వికెట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య గత రాత్రి జరిగిన తొలి వన్డేలో లంక తొలుత బ్యాటింగ్‌ చేసి 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టుకు‌ ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌(65; 90 బంతుల్లో 4x4, 2x6), షై హోప్‌(110; 133 బంతుల్లో 12x4, 1x6) శుభారంభం చేయగా, చివర్లో బ్రావో(37; 47 బంతుల్లో 2x4, 1x6) రాణించాడు. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన విండీస్​.. 47 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 8 వికెట్ల తేడాతో కరీబియన్‌ జట్టు ఘన విజయం సాధించింది.

కళ్లు చెదిరే క్యాచ్​..

అయితే, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు గుణతిలక(55; 61 బంతుల్లో 7x4), కరుణరత్నె(52; 61 బంతుల్లో 4x4) తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరిని పొలార్డ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేర్చాడు. తొలుత అతడు వేసిన 19.2 ఓవర్‌లో కరుణరత్నె షాట్‌ ఆడగా బంతి బౌలర్‌ కుడివైపు నుంచి వెళ్లింది. దాంతో వెంటనే స్పందించిన పొలార్డ్‌ తన కుడిచేతిని చాచి క్యాచ్‌ పట్టడానికి యత్నించాడు. అయితే బంతి చేతికి తగిలి గాల్లోకి లేచింది. అలాగే కష్టపడి ముందుకెళ్లి ఒంటి చేత్తో ఆ బంతిని ఒడిసిపట్టాడు. దాంతో లంక తొలి వికెట్‌ కోల్పోయింది.

అబ్​స్ట్రక్టింగ్​గా వెనుదిరిగిన గుణతిలక..

తర్వాత పొలార్డ్‌ వేసిన 21.1 ఓవర్‌కు గుణతిలక డిఫెన్స్‌ ఆడగా, బంతి అతడి కాళ్ల వద్దే ఆగిపోయింది. అది గమనించకుండా ముందుకు వెళ్లిన అతడు.. పొలార్డ్‌ రనౌట్‌ చేయడానికి వస్తున్నట్లు గమనించి మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ నిస్పంకను పరుగు కోసం రావొద్దని చెప్పాడు. అదే సమయంలో అతడు కూడా క్రీజులోకి వెనక్కి పరుగెడుతూ అనుకోకుండా బంతిని కాలితో తన్నాడు. అప్పటికే పొలార్డ్‌ రనౌట్‌ చేయడానికి బంతి దగ్గరికి వచ్చాడు. దీంతో గుణతిలక కావాలనే బంతిని తన్నాడని, అది క్రికెట్‌ నిబంధనలకు విరుద్ధమని అప్పీల్‌ చేశాడు. విషయం థర్డ్‌ అంపైర్‌కు చేరింది. అతడు రీప్లే చూసి ఔటిచ్చాడు.

  • Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN

    — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

క్రికెట్‌ నిబంధనల ప్రకారం ఎవరైనా బ్యాట్స్‌మెన్‌ ఉద్దేశపూర్వకంగా తమ మాటలతో లేదా, చేష్టలతో ఫీల్డింగ్‌ చేస్తున్న జట్టుకు అడ్డంకులు సృష్టిస్తే ఆ బ్యాట్స్‌మెన్‌ను అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌గా పరిగణిస్తూ ఔటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఔటిచ్చారు. అయితే, గుణతిలక అనుకోకుండా బంతిని తన్నాడని, ఉద్దేశపూర్వకంగా కాదని నెటిజెన్లు మండిపడుతున్నారు. అతడిని ఔటివ్వాల్సింది కాదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడా రెండు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి: ఆర్సీబీ కొత్త వికెట్ కీపర్​గా ఫిన్​ ఆలెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.