ETV Bharat / sports

'కోహ్లీ విషయంలో అలా అనుకోను.. కానీ!' - కెవిన్​ పీటర్సన్​ వార్తలు

భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు ఇంగ్లాండ్​ మాజీ వెటరన్​ బ్యాట్స్​మెన్​ కెవిన్​ పీటర్సన్​. టీమ్​ఇండియా కెప్టెన్సీ విషయంలో విరాట్​ విఫలమవుతున్నాడని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ఇంగ్లాండ్​తో రెండో టెస్ట్​లో అతడు జట్టుకు విజయాన్నందిస్తాడని చెప్పాడు.

Kevin Pietersen backed Virat Kohli's capacity issues
కోహ్లీ విషయంలో అలా అనుకోను.. కానీ.!
author img

By

Published : Feb 12, 2021, 8:01 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి అండగా ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైంది. అదే సమయంలో రహానె.. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలుపొందడంతో విరాట్​ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు పలువురు క్రికెటర్లు, అభిమానుల నుంచి అతడిని కెప్టెన్‌గా తప్పించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పందించిన పీటర్సన్‌.. అతడికి మద్దతుగా నిలిచాడు.

'పరిస్థితులు అలా మారాలని కోరుకోను. కానీ.. టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ చుట్టూ జరిగే చర్చను విస్మరించడం అసాధ్యమని చెప్పాలి. కోహ్లీ ఇప్పటికే నాలుగు టెస్టులు ఓడిపోయాడు. అదే సమయంలో రహానె ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాడు. దీంతో సామాజిక మాధ్యమాలు, టీవీ, రేడియో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. భారత్‌కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. దురదృష్టం కొద్దీ ఇలాంటివి చోటుచేసుకుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీకి ఇంకో ఓటమి అవసరం లేదు. అయితే.. రెండో టెస్టులో టీమ్‌ఇండియాకు విజయం అందించే సత్తా అతడికుంది' అని పీటర్సన్‌ పేర్కొన్నాడు.

గతేడాది ఫిబ్రవరిలో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టెస్టులు ఓడింది. ఆపై.. ఆస్ట్రేలియాలో అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ టీమ్‌ఇండియా ఘోర పరాభవం పాలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఓటమి చవిచూసింది. వీటన్నింటికి కోహ్లీ సారథ్యం వహించాడు. మరోవైపు ఆసీస్‌ పర్యటనలో కోహ్లీ తొలి టెస్టు తర్వాత పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగి వచ్చాక.. రహనె రెండు విజయాలతో సిరీస్‌ కైవసం చేసుకున్నాడు. దీంతో అతడికి జట్టు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఇవీ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా భారత్​, ఇంగ్లాండ్​ అమీతుమీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.