ETV Bharat / sports

కపిల్​దేవ్ బర్త్​డే:  ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

ప్రపంచకప్​లో టీమ్​ఇండియాకు తొలి ట్రోఫీని అందించారు దిగ్గజ క్రికెటర్ కపిల్​ దేవ్​. 1983లో జరిగిన వరల్డ్​కప్​లో తన ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అందర్ని ఔరా! అనిపించారు. క్రికెట్​ అభిమానులకు ఆరాధ్య దైవమైన కపిల్​ దేవ్​ బుధవారం 62వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ​

Kapil Dev turns 62: Sachin, Virat lead wishes
కపిల్​దేవ్​కు క్రికెట్​ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
author img

By

Published : Jan 6, 2021, 3:28 PM IST

1983 ప్రపంచకప్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కపిల్‌దేవ్‌. భారత క్రికట్‌ ప్రస్థానంలో ఆయనో సంచలనం. కపిల్ కెప్టెన్సీ ఓ చరిత్ర. ఆయన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన అమోఘం. ఒక్కమాటలో చెప్పాలంటే.. '1983 ప్రపంచకప్‌ భారత్‌ గెలిచింది' అనేకన్నా 'కపిల్‌దేవ్‌ గెలిపించాడు' అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా పేరుగాంచిన కపిల్‌ భారత్‌లో ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శప్రాయుడయ్యారు. ఆటతీరుతో యావత్‌ క్రీడాలోకాన్నే ఔరా అనిపించారు. ఏమాత్రం అంచనాల్లేని టీమ్ఇండియాను ఏకంగా విశ్వవిజేతగా తీర్చిదిద్దారు. క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడారు.

Kapil Dev turns 62: Sachin, Virat lead wishes
కపిల్​దేవ్

ఇక అప్పుడు మొదలైంది అసలు మజా. క్రికెట్‌ కనిపెట్టిన ఆ దేశంలో కన్నా భారత్‌లోనే ఈ ఆటకు అభిమానులు ఎక్కువయ్యారు. మరోమాటలో చెప్పాలంటే ఇక్కడ క్రికెట్‌ మతంలా మారింది. అందుకు కారణం ది గ్రేట్‌ లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌. బుధవారం (జనవరి 6) ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ప్రముఖ క్రికెటర్లు కపిల్​దేవ్​కు శుభాకాంక్షలు తెలియజేశారు.

"పుట్టినరోజు శుభాకాంక్షలు కపిల్​దేవ్​ పాజీ. ఈ ఏడాది మీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా".

- సచిన్​ తెందూల్కర్​, దిగ్గజ క్రికెటర్​

  • Happy Birthday @therealkapildev 🎂. Wishing you happy times ahead for you and your family. Have a wonderful and a healthy year ahead.

    — Virat Kohli (@imVkohli) January 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పుట్టినరోజు శుభాకాంక్షలు కపిల్​దేవ్. ఈ ఏడాది మీ కుటుంబంలో సంతోషంతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా".

- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

  • Wishing a very Happy Birthday to the legendary champion & greatest all-rounder @therealkapildev paaji 🎂 May you continue to be blessed with good health and success. Looking forward to teeing-off with you real soon! Have a wonderful year ahead. Best wishes pic.twitter.com/ma5ovCO8Ea

    — Yuvraj Singh (@YUVSTRONG12) January 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"లెజెండరీ ఛాంపియన్​, గ్రేటెస్ట్​ ఆల్​-రౌండర్​ కపిల్​దేవ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యంగా, విజయవంతమైన జీవితాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా".

- యువరాజ్​ సింగ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

"ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపి.. వారికి ప్రేరణగా నిలిచిన వ్యక్తికి (కపిల్​దేవ్​) పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆరోగ్యంతో పాటు మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని ఆశిస్తున్నా".

- వీవీఎస్​ లక్ష్మణ్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

సామాజిక మాధ్యమాల్లో అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ), భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) కపిల్​దేవ్​కు శుభాకాంక్షలు తెలిపాయి.

అత్యధిక టెస్టు వికెట్ల(434) రికార్డు కపిల్ పేరు మీద ఆరేళ్ల పాటు ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్​కు చెందిన కోర్ట్నీ వాల్ష్​ కపిల్​ రికార్డును అధిగమించాడు. 1983లో జరిగిన ప్రపంచకప్​లో టీమ్ఇండియాకు కపిల్​దేవ్​ సారథ్యం వహించాడు.

కపిల్​దేవ్​

గతేడాది అక్టోబరులో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కపిల్​దేవ్​కు యాంజియోప్లాస్టీ చేశారు. ఆ తర్వాత కోలుకున్న కపిల్​దేవ్​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

ఇదీ చూడండి: సిడ్నీ టెస్టుకు భారత జట్టు ప్రకటన.. సైనీ అరంగేట్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.