టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌కు గురువారం రాత్రి ఛాతీలో నొప్పి రావడం వల్ల దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని అన్నారు.
కపిల్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెటర్లు, మాజీలు.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వీరిలో సచిన్ తెందుల్కర్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఉన్నారు.
కొన్నిరోజుల్లో కపిల్ ఇంటికొస్తారు: మదన్
కపిల్ కోలుకోవాలని తనతో పాటే ప్రార్థించాలని ఆయన సహచరుడు మదన్‌లాల్ కోరారు. త్వరలోనే కపిల్ ఇంటికొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీమ్ఇండియాకు 16 ఏళ్ల పాటు క్రికెటర్‌గా సేవలు అందించిన కపిల్.. 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5000 పరుగులు తీయడం సహా 400కు పైగా వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.