ఈనెల 14 నుంచి భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ(టీమిండియా), డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఇదే విషయమై ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ డోన్స్ స్పందిస్తూ వీరిద్దరి మధ్య పోటీ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
"రోహిత్ శర్మ, వార్నర్ మైదానం రెండు పక్కలా షాట్స్ ఆడగలరు. ఒక వైపు మీరు కట్టుదిట్టం చేస్తే రెండో వైపు బంతిని తరలిస్తారు. వీరిద్దరు శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలంగా ఉన్నారు. ఈ సిరీస్లో వీరిలో గెలుపెవరిదో చూడాలి"
-డీన్ జోన్స్, ఆసీస్ మాజీ క్రికెటర్
భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ముంబయి వేదికగా జరగనుంది. 17న రాజ్కోట్ వేదికగా రెండో మ్యాచ్, 19న బెంగళూరు వేదికగా మూడో వన్డే నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: ధోనీలా బెస్ట్ ఫినిషర్ అవ్వాలనుకుంటున్నా: కారే