కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్‌తో సహా ఎన్నో మెగాటోర్నీలు వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు అనుకోని విరామం ఏర్పడింది. దీంతో టీమిండియా క్రికెటర్లు తమ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఫన్నీ వీడియోలతో అభిమానులను తరచూ సామాజిక మాధ్యమాల్లో అలరిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంటిని శుభ్రం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
-
My modified mobility drills are keeping the house clean and my mother very happy. 😎💪🏼 (P.s - I had to do everything again without the slippers.🤣🤣) pic.twitter.com/gFDrovK59t
— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My modified mobility drills are keeping the house clean and my mother very happy. 😎💪🏼 (P.s - I had to do everything again without the slippers.🤣🤣) pic.twitter.com/gFDrovK59t
— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 30, 2020My modified mobility drills are keeping the house clean and my mother very happy. 😎💪🏼 (P.s - I had to do everything again without the slippers.🤣🤣) pic.twitter.com/gFDrovK59t
— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 30, 2020
ప్రస్తుతం ఇంటిని శుభ్రం చేయడమే శారీరక కసరత్తులని, దీంతో తన తల్లి ఎంతో సంతోషిస్తుందని వీడియోకి వ్యాఖ్య జత చేశాడు. అయితే వీడియోలో బుమ్రా చెప్పులతో ఇంటిని శుభ్రం చేశాడు. దీంతో నెటిజన్ల ట్రోల్స్ చేస్తారని ముందే ఊహించి చెప్పులు లేకుండా రెండోసారి శుభ్రం చేశానని తెలిపాడు. భారత్ తరఫున బుమ్రా 14 టెస్టులు, 64 వన్డేలు, 49 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదీ చూడండి.. లాక్డౌన్ సమయంలో క్రికెటర్లు చేసే పనులేంటి!