ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ గాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కమిన్స్ వేసిన బంతి పంత్ ఎడమ చేతికి గట్టిగా తగిలింది. దీంతో అతడు విలవిల్లాడాడు. వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించినా నొప్పిని భరించలేకపోయాడు. కాసేపటికే హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో డేవిడ్ వార్నర్ చేతికి చిక్కి పంత్ ఔటయ్యాడు.
-
Rishabh Pant was hit on the left elbow while batting in the second session on Saturday. He has been taken for scans. #AUSvIND pic.twitter.com/NrUPgjAp2c
— BCCI (@BCCI) January 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rishabh Pant was hit on the left elbow while batting in the second session on Saturday. He has been taken for scans. #AUSvIND pic.twitter.com/NrUPgjAp2c
— BCCI (@BCCI) January 9, 2021Rishabh Pant was hit on the left elbow while batting in the second session on Saturday. He has been taken for scans. #AUSvIND pic.twitter.com/NrUPgjAp2c
— BCCI (@BCCI) January 9, 2021
అనంతరం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటయ్యాక.. పంత్‌ను స్కానింగ్ చేయించేందుకు తరలించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించగా, పంత్ స్థానంలో సాహా కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.
జడేజాకూ గాయం
జడేజా కూడా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. మిచెల్ స్టార్క్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతడి ఎడమ చేతి బొటనవేలుని గాయపరిచింది. స్వల్ప వైద్య చికిత్స అనంతరం అతడు బ్యాటింగ్ కొనసాగించినా.. తర్వాత తీవ్రత ఎక్కువవడం వల్ల ఫీల్డింగ్‌కు రాలేదు. ఇదే విషయమై స్పందించిన బీసీసీఐ జడేజానూ స్కానింగ్ కోసం ఆస్పత్రి తరలించినట్లు వెల్లడించింది.
-
UPDATE - Ravindra Jadeja suffered a blow to his left thumb while batting. He has been taken for scans.#AUSvIND pic.twitter.com/DOG8SBXPue
— BCCI (@BCCI) January 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">UPDATE - Ravindra Jadeja suffered a blow to his left thumb while batting. He has been taken for scans.#AUSvIND pic.twitter.com/DOG8SBXPue
— BCCI (@BCCI) January 9, 2021UPDATE - Ravindra Jadeja suffered a blow to his left thumb while batting. He has been taken for scans.#AUSvIND pic.twitter.com/DOG8SBXPue
— BCCI (@BCCI) January 9, 2021
ఇదీ చూడండి: తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 244 ఆలౌట్