ETV Bharat / sports

టెస్టుల్లో ఓపెనింగ్​ చేయడానికి సిద్ధం: వాషి - indian cricket

భారత జట్టుకు ఓపెనింగ్​ చేసే అవకాశం వస్తే తాను సిద్ధమని ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​ తెలిపాడు. సవాళ్లు ఎదుర్కొనే విషయంలో కోచ్​ రవిశాస్త్రి మాటలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నాడు.

It would be a blessing if I ever open batting in Tests: Washington
'కోచ్​ రవిశాస్త్రి​ విసిరిన సవాలుకు నేను సిద్ధం'
author img

By

Published : Jan 24, 2021, 6:07 PM IST

ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనేందుకైనా సిద్ధమని.. అవకాశమొస్తే టెస్టుల్లో భారత జట్టుకు ఓపెనింగ్​ చేయడానికైనా ఓకే అని యువ ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​ తెలిపాడు. ఈ విషయంలో.. డ్రెస్సింగ్​ రూమ్​లో కోచ్​ రవిశాస్త్రి పంచుకునే అనుభవాలు తనకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నాడు.

అండర్​-19 జట్టుకు ఆడేటప్పుడు వాషింగ్టన్​ టాప్​ ఆర్డర్ స్పెషలిస్ట్​ బ్యాట్స్​మన్​. అయితే ఆ తర్వాత ఫుల్​టైమ్​ ఆఫ్​ స్పిన్నర్​గా మారిపోయాడు. భారత టీ-20 జట్టులో అతని ఎంపికకు అదే ఉపయోగపడింది.

కోచ్​ రవిశాస్త్రి.. భారత జట్టుకు ఆడే రోజుల్లో అతడి అనుభవాలను మాతో పంచుకునేవాడు. ఆ విషయాలన్నీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవి. అరంగ్రేటంలో స్పెషలిస్టు స్పిన్నర్​గా కెరీర్​ను ఆరంభించిన ఆయన.. న్యూజిలాండ్​తో మ్యాచ్​లో 4 వికెట్లు తీసి, పదో స్థానంలో బ్యాటింగ్​ చేసినట్లు చెప్పాడు. తర్వాతి రోజుల్లో ఓపెనర్​గా మారాడు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్​ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. టెస్టుల్లో ఓపెనింగ్​ బ్యాటింగ్​ చేయాలంటే నాకెంతో ఇష్టం.

-వాషింగ్టన్​ సుందర్​, భారత బౌలర్​.

ఫస్ట్​ క్లాస్​ క్రికెట్లో సుందర్​కు 32 బ్యాంటింగ్​ సగటు ఉండటం విశేషం.

డ్రెస్సింగ్​ రూమ్​లోనూ చాలా మంది రోల్ మోడల్స్​ ఉన్నట్లు వాషింగ్టన్​ పేర్కొన్నాడు. విరాట్​, రోహిత్​, రహానే, అశ్విన్​ వంటి ఆటగాళ్లు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపాడు.

వాషింగ్టన్​ సుందర్​.. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ రాణించాడు. ​

ఇదీ చదవండి: వారంలోనే రెండో 'థాయ్​' టైటిల్​​ గెలిచిన కరోలినా​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.