బాక్సింగ్ డే టెస్టు విజయంతో తాత్కాలిక కెప్టెన్ రహానెను ఆసీస్ దిగ్గజాలు ప్రశంసించడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని భారత మాజీ క్రికెటర్ గావస్కర్ అన్నాడు. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చాడు.
"ఆస్ట్రేలియా దిగ్గజాలు పాంటింగ్, గిల్‌క్రిస్ట్, మైక్ హస్సీ, షేన్ వార్న్ లాంటి స్టార్ ఆటగాళ్లు రహానెను పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వైట్‌వాష్ అవుతుందని చెప్పిన కొందరు ఆసీస్ క్రికెటర్లకు ఈ విజయంతో భారత సరైనా సమాధానమిచ్చింది. టీమ్ఇండియా, ఓటమితో డీలా పడే జట్టు కాదు తిరిగి పుంజుకుని బలంగా ఢీ కొట్టే జట్టు"
-గావస్కర్, భారత దిగ్గజ క్రికెటర్.
ఈ మ్యాచ్‌తోనే టెస్టు అరంగేట్రం చేసిన గిల్ ఆటతీరును గావస్కర్ ప్రశంసించాడు. తన ఆటను ఇలానే కొనసాగిస్తే టీమ్ఇండియాలో కీలక ఆటగాడు అవుతాడని అన్నాడు. తుది జట్టులో జడేజాకు అవకాశం కల్పించే విషయమై టీమ్‌మేనేజ్‌మెంట్ మంచి నిర్ణయం తీసుకుందని అన్నాడు. పేలవ ప్రదర్శన చేస్తున్న మయాంక అగర్వాల్‌కు మూడో టెస్టులోనూ మరో అవకాశమివ్వాలని సూచించాడు.
![rahaney](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pjimage-9-1606116445_3012newsroom_1609291180_1050.jpg)
ఇదీ చూడండి : జడేజా సరికొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చోటు