2023లో భారత్ వేదికగా క్రికెట్ ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ జరగడానికి దాదాపు ఇంకా 4 ఏళ్లున్నా.. అందులో పాల్గొనే ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఊహిస్తూ ఓ టీమ్‌ను తయారు చేసింది 'ఫాక్స్ క్రికెట్'. కానీ ఆ జాబితాలో పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ లేకపోవడం గమనార్హం.
ఆరోన్ ఫించ్‌కు అప్పటికి 36 ఏళ్ల వయసు అవుతుందనే కారణంగా అతడి స్థానంలో 22 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ ఆటగాడు జోష్ ఫిలిప్‌ను జట్టులోకి తీసుకున్నామని 'ఫాక్స్ క్రికెట్' తెలిపింది. కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడని ఆ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
ఈ ట్విట్టర్ పోస్ట్‌పై ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ భాగస్వామి డేవిడ్ వార్నర్ నిరాశను వ్యక్తం చేశాడు. ఫించ్ కూడా ఈ పోస్ట్‌పై ట్విట్టర్లో స్పందించాడు.
"నేను అది గమనించాను. ఇది దురదృష్టకరం. 2023 ప్రపంచకప్‌లో ఆడటమనేది నాకున్న లక్ష్యాలలో ఒకటి. అంతర్జాతీయ క్రికెట్‌లో అదే నా చివరి ఆట అని నేను అనుకుంటున్నాను. నా ఆటతీరును మెరుగుపరచటానికి నా సమయాన్ని వెచ్చిస్తున్నాను. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ నా మొదటి లక్ష్యం. 2023 ప్రపంచకప్ నా రెండో లక్ష్యం. అప్పటికి నా ప్రదర్శనను మెరుగు పరచుకుంటా."
- ఆరోన్ ఫించ్, ఆసీస్ కెప్టెన్
- — Aaron Finch (@AaronFinch5) March 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Aaron Finch (@AaronFinch5) March 27, 2020
">— Aaron Finch (@AaronFinch5) March 27, 2020
ఇదీ చూడండి.. కరోనాపై పోరుకు రూ.50 లక్షలు ప్రకటించిన సచిన్