కరోనా వైరస్ (కొవిడ్19) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఖాళీ సమయాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు. పలువురు క్రీడాకారులు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అభిమానులకు సూచనలు చేస్తూ.. తమలోని కళా నైపుణ్యాలని ప్రదర్శిస్తున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌పఠాన్ తన సోదరుడు యూసుఫ్ పఠాన్‌తో కలిసి ఓ వీడియో రూపొందించాడు.
పఠాన్ సోదరులు అందులో బాలీవుడ్ సినిమా 'సూర్య'లోని ఓ సన్నివేశాన్ని తీసుకుని నటించారు. యూసుఫ్ పఠాన్ రాజ్‌కుమార్ పాత్రలో, ఇర్ఫాన్ పఠాన్ అమ్రిష్‌పురి పాత్రల్లో ఆకట్టుకున్నారు. "హాత్ తొ మిలా లేతా లాలా" అనే డైలాగ్‌తో కూడిన ఈ వీడియోను ఇర్ఫాన్ తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. శనివారం కూడా ఒక టిక్‌టాక్ వీడియో చేసి దాన్నీ అభిమానులతో పంచుకున్నాడు.
కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రజలు సామాజిక దూరం పాటించాలని, అలాగే పలు జాగ్రత్తలు తీసుకోవాలని మరో వీడియోలో తెలిపాడు ఇర్ఫాన్. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ప్రభుత్వ హెచ్చరికలను పాటించాలని విజ్ఞప్తి చేశాడు.
-
Enjoying #JantaCurfew @iamyusufpathan pic.twitter.com/uIVcJEd3Aa
— Irfan Pathan (@IrfanPathan) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Enjoying #JantaCurfew @iamyusufpathan pic.twitter.com/uIVcJEd3Aa
— Irfan Pathan (@IrfanPathan) March 22, 2020Enjoying #JantaCurfew @iamyusufpathan pic.twitter.com/uIVcJEd3Aa
— Irfan Pathan (@IrfanPathan) March 22, 2020