ETV Bharat / sports

షార్జా స్టేడియాన్ని చూసి ముగ్ధుడైన గంగూలీ

ఐపీఎల్​ వేదికల్లో ఒకటైన షార్జా స్టేడియాన్ని సందర్శించారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. మైదానం పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన సదుపాయాలను మెచ్చుకున్నారు.

IPL update
గంగూలీ
author img

By

Published : Sep 15, 2020, 5:27 AM IST

ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించనున్న మూడు వేదికల్లో ఒకటైన షార్జా క్రికెట్​ స్టేడియాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ సందర్శించారు. ఈ క్రమంలోనే మైదానానికి జోడించిన నూతన హంగులను చూసి ముగ్ధుడయ్యారు. సునీల్​ గావస్కర్​, సచిన్ తెందూల్కర్ వంటి గొప్ప క్రికెటర్లు చరిత్ర సృష్టించిన ఈ క్రికెట్​ మైదానంలో ఆడేందుకు యువ ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని గంగూలీ తెలిపారు.

ఈ పర్యటనలో గంగూలీతో పాటు ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​, మాజీ చీఫ్​ రాజీవ్​ శుక్లా, సీఈఓ హేమాంగ్​ అమిన్​ పాల్గొన్నారు.

ఇటీవలే షార్జా స్టేడియాన్ని పునర్నిర్మించారు. ఈ క్రమంలోనే అప్​గ్రేడ్​ రాయల్​ సూట్​, కామెంటరీ బాక్స్​, వీఐపీ హాస్పిటాలిటీ వంటి కరోనా సంబంధిత ప్రోటోకాల్స్​కు అనుగుణంగా సదుపాయాలు కల్పించారు. ఈ మెగా లీగ్​లో 12 మ్యాచ్​లు ఈ మైదానంలో నిర్వహించనున్నారు.

భారత్​లో కరోనా విజృంభిస్తున్న కారణంగా.. లీగ్​ను యూఏఈలో నిర్వహిస్తున్నారు. 53 రోజుల పాటు సాగే ఈ టోర్నీ.. దుబాయ్​, అబుదాబి, షార్జా నగరాల్లోని స్టేడియాల్లో జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.