ETV Bharat / sports

ఐపీఎల్ 2020: 'ది గ్రేట్' సారథుల రికార్డులు ఇవే!

author img

By

Published : Sep 15, 2020, 11:33 AM IST

Updated : Sep 15, 2020, 11:50 AM IST

ఐపీఎల్​ 13వ సీజన్​ ఈ శనివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల సారథుల రికార్డులను ఓసారి పరిశీలిద్దాం. ఆటగాళ్లు తమ లీగ్​ కెరీర్​లో కెప్టెన్​గా వ్యవహరిస్తూ ఎన్ని మ్యాచ్​లు ఆడారు..? అందులో ఎన్ని విజయాలు, ఓటములను జట్టుకు అందించారు..? వారి విజయాల శాతం ఎంత..? వంటి విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి..

IPL
ఐపీఎల్

ఐపీఎల్​.. ప్రపంచంలోనే బహుళ ప్రజాదరణ పొందిన లీగ్​ సహా అత్యధిక ధనిక లీగుల్లో ఒకటి. ఈ మెగాటోర్నీ కోసం కోట్ల మంది అభిమానులు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఇందులోని జట్లకు సారథిగా వ్యవహరించడమంటే ఎంతో బాధ్యత, ఒత్తిడితో కూడిన విషయం.

ఇప్పటివరకు 12 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ టోర్నీలో.. కెప్టెన్లుగా బాధ్యతలు స్వీకరించిన కొంతమంది ఆటగాళ్లు.. జట్టును విజయపథం వైపు నడిపించి తమ సత్తా చాటారు. అయితే ఈ సీజన్​ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మెగాలీగ్​లో పాల్గొంటున్న​ జట్లను నడిపిస్తున్న రథ సారుథుల రికార్డులను పరిశీలిద్దాం.

మహేంద్రసింగ్​ ధోనీ(సీఎస్కే)

మహేంద్రసింగ్​ ధోనీ.. ప్రశాంత స్వభావంతో ప్రపంచ క్రికెట్​లో విజయవంతమైన సారథుల్లో ఒకరిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2008 నుంచి ఇప్పటివరకు జరిగిన 12 ఐపీఎల్​ సీజన్లలో చెన్నై సూపర్​ కింగ్స్​(సీఎస్కే), రైజింగ్​ పుణె సూపర్ ​జెయింట్స్​ జట్టుకు సారథిగా వ్యవహరించాడు.

మొత్తంగా ఈ మెగాటోర్నీ కెరీర్​లో ఏ ఆటగాడు సాధించని ఘనతను ఇతడు దక్కించుకున్నాడు. 174 మ్యాచులకు సారథిగా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. వీటిలో తన వ్యూహాత్మక ఆటతో 104 మ్యాచులు గెలవగా.. 69 మ్యాచుల్లో ఓటమి పాలయ్యాడు. బలమైన సారథిగా 60.11 విజయశాతం సాధించిన మహీ.. తన కెప్టెన్సీలో సీఎస్కేకు మూడు టైటిల్స్​ అందించాడు. అత్యధిక ఐపీఎల్​ ట్రోఫీలు సొంతం చేసుకున్న సారథుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

dhoni
ధోనీ

కోహ్లీ(ఆర్సీబీ)

టీమ్​ఇండియా సారథి కోహ్లీ.. తనదైన దూకుడుడైన ఆటతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తాడు. గత తొమ్మిది సీజన్ల నుంచి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తూ.. జట్టు బాధ్యతల్ని తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు తన జట్టుకు ఒక్క ట్రోఫీ అందించలేకపోయాడు. దీనిపై తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ ఫ్రాంఛైజీ ఇతడిపై నమ్మకం ఉంచి సారథ్య బాధ్యతలు ఇతడికే అప్పగిస్తూ వస్తోంది.

మొత్తంగా ఈ మెగాటోర్నీ కెరీర్​లో 110 మ్యాచులకు సారథిగా వ్యవహరించి.. 49 సార్లు గెలిచి, 55 సార్లు ఓడాడు. రెండు 'టై' కాగా మరో నాలుగింటిలో ఫలితాలు తేలలేదు. విజయశాతం 47.16గా ఉంది.

kohli
కోహ్లీ

రోహిత్​ శర్మ(ముంబయి ఇండియన్స్​)

రోహిత్​ శర్మ.. ఇతడి ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల కొద్ది రన్నులు బాదేస్తాడు. అలవోకగా సిక్సర్ల మోత మోగిస్తాడు. అలాంటి ఈ స్టార్​ బ్యాట్స్​మన్​​.. 2013లో ముంబయి ఇండియన్స్​కు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అనంతర కాలంలో జట్టును నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. అత్యధిక టైటిల్స్​ సాధించిన జాబితాలో.. ముంబయి జట్టును అగ్రస్థానంలో ఉంచాడు. మొత్తంగా 104 మ్యాచులకు కెప్టెన్సీ చేసి.. 60 సార్లు విజయం, 42 సార్లు ఓటమిని జట్టుకు అందించాడు. ఇతడి విజయశాతం 58.65గా ఉంది.

rohit
రోహిత్​

దినేశ్​ కార్తీక్​(కోల్​కతా నైట్​ రైడర్స్​)

దినేశ్ కార్తీక్​.. దిల్లీ డేర్​డెవిల్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్​కు సారథిగా వ్యవహరించాడు. దిల్లీకి ఆడినప్పుడు పేలవమైన ప్రదర్శన చేసినా.. ప్రస్తుతం కేకేఆర్​కు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్​ కెరీర్​లో సారథిగా 36 మ్యాచులు ఆడగా.. 17 గెలిచి, 18 సార్లు ఓటమి పాలయ్యాడు. ఒకటి టైగా మిగిలింది. ఇతడి విజయశాతం 48.61గా ఉంది.

dinesh
దినేశ్​ కార్తీక్​

డేవిడ్​ వార్నర్​(సన్​రైజర్స్​ హైదరాబాద్​)

ఆస్ట్రేలియా స్టార్​ డేవిడ్​ వార్నర్.. సన్​రైజర్స్​ హైదరాబాద్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. 2015, 2017 వరకు మొత్తం 45 మ్యాచ్​లకు కెప్టెన్​గా చేశాడు. 2016లో జట్టును విజేతగా నిలిపాడు. మొత్తంగా సారథిగా 47 మ్యాచులకు ఆడగా.. 26 సార్లు విజయం, 21 సార్లు ఓటమిని అందించాడు. విజయశాతం 55.31గా ఉంది.

warer
వార్నర్​

స్టీవ్​ స్మిత్​(రాజస్థాన్​ రాయల్స్​)

స్టీవ్​ స్మిత్​.. ఐపీఎల్​లో పూణె వారియర్స్​, రాజస్థాన్​ రాయల్స్​, రైజింగ్​​ పుణె తరఫున సారథిగా వ్యవహరించాడు. కెరీర్​లో సారథిగా 29 మ్యాచులు ఆడగా.. 19 సార్లు గెలవగా, తొమ్మిది సార్లు ఓటమిపాలయ్యాడు. విజయశాతం 67.85గా ఉంది.

smith
స్మిత్​

శ్రేయస్​ అయ్యర్​(దిల్లీ డేర్​డెవిల్స్)

2018లో దిల్లీ డేర్​డెవిల్స్​ సారథిగా గౌతమ్ గంభీర్​ తప్పుకున్న తర్వాత శ్రేయస్​ అయ్యర్​ పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్​గా 24 మ్యాచులు ఆడి 13 సార్లు విజేతగా, 10 సార్లు ఓటమి చెందాడు. ఒక మ్యాచ్​ టైగా నిలిచింది. విజయశాతం 56.25గా ఉంది.

shreyas
శ్రేయస్​

కేఎల్​ రాహుల్​(కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​)

కేఎల్​ రాహుల్​.. ఈ సీజన్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​కు తొలిసారిగా కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు రవిచంద్రన్​ అశ్విన్​ సారథిగా ఉన్నాడు.

rahul
కేఎల్​ రాహుల్​

ఇదీ చూడండి కార్తీక్​, రసెల్​ గొడవ పడలేదు: హస్సీ

Last Updated : Sep 15, 2020, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.