కోల్‌కతా వేదికగా గురువారం జరిగే ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ .. దేశవాళీల్లో ప్రతిభ చూపిన యువ క్రికెటర్లపై దృష్టిసారించనుంది. స్వదేశీ బ్యాట్స్‌మెన్, విదేశీ బౌలర్లనూ సొంతం చేసుకొనే ఆలోచనలో ఉంది.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు
స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, మహిపాల్ లోమ్రార్, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్ర,
- ట్రేడెడ్ ఇన్: మయాంక్ మార్కండే(దిల్లీ నుంచి), అంకిత్ రాజ్‌పుత్(పంజాబ్ నుంచి)
వదులుకున్న క్రికెటర్లు: ఆస్టన్ టర్నర్, ఒషానో థామస్, శుభమ్ రంజానే, ప్రశాంత్ చోప్రా, ఇష్ సోది, ఆర్యమన్ బిర్లా, జయదేవ్ ఉనద్కత్,క రాహుల్ త్రిపాఠి, స్టువర్ట్ బిన్నీ, లివింగ్స్టన్, సుదేశన్ మిధున్
- ట్రేడెడ్ ఔట్: అజింక్య రహానే(దిల్లీకి), క్రిష్ణప్ప గౌతమ్(పంజాబ్‌కు)
ఉన్న నగదు: రూ.28.90 కోట్లు
మిగిలున్న స్థానాలు: 11(స్వదేశీ 7, విదేశీ 4)
వ్యూహం
రాజస్థాన్ రాయల్స్‌కు ఇప్పటికే విదేశీ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం వదులుకున్న రహానే, ఉనద్కత్, గౌతమ్ స్థానాల్ని భర్తీ చేసే క్రికెటర్ల కోసం ఈ వేలంలో పాల్గొనుంది.
అదే విధంగా భారత బ్యాట్స్‌మన్, పేసర్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఓవర్సీస్ ఆటగాళ్ల బ్యాకప్ కోసం కొత్త వారిని తీసుకొనే ఆలోచనలో ఉంది.
దృష్టి సారించే ఆటగాళ్లు
సిమన్స్, హెట్మయిర్, టామ్ బాంటన్, ఎవాన్స్, జేమ్స్ నీషమ్, యూసఫ్ పఠాన్, మనోజ్ తివారి, హనుమ విహారి, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, సామ్ కరన్, మోహిత్ శర్మ, లుక్మన్ మెరియవాలా, విరాట్ సింగ్, మార్కస్ స్టొయినిస్, క్రిస్ మోరిస్