ETV Bharat / sports

ఐపీఎల్ వేలంలో 292 మంది క్రికెటర్లు - చెన్నై

వచ్చే ఐపీఎల్​ కోసం 292 మంది క్రికెటర్లు వేలంలో ఉండనున్నారు. భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ అత్యధికంగా రూ.2 కోట్ల స్లాట్​లో చోటు దక్కించుకున్నారు.

IPL 2021 player auction list announced, 292 cricketers to go under the hammer
ఐపీఎల్​ వేలం జాబితా.. అత్యధిక ధర ఎవరిదో తెలుసా?
author img

By

Published : Feb 12, 2021, 5:30 AM IST

ఐపీఎల్​ 2021 కోసం వేలంలో ఉండే క్రికెటర్ల జాబితా వెల్లడైంది. చెన్నైలో ఫిబ్రవరి 18న జరిగే ఈ వేలం ప్రక్రియలో 292 మంది ఆటగాళ్లు ఉండనున్నారు.

వేలం కోసం మొత్తం 1,114 క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారని లీగ్ తెలిపింది. అయితే 8 ఫ్రాంఛైజీలు నివేదించిన షార్ట్​ లిస్ట్​ తర్వాత తుది జాబితాను ప్రకటించింది.

అత్యధికంగా రూ.2 కోట్ల స్లాట్​లో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ చోటు దక్కించుకున్నారు. వారితో పాటు మాక్స్​వెల్, స్టీవ్ స్మిత్, షకిబ్​ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియమ్ ప్లంకెట్, జేసన్ రాయ్, మార్క్​ వుడ్.. అదే బ్రాకెట్​లో ఉన్నారు.

రూ.1.5 కోటి మూల ధర వద్ద 12 మంది ఆటగాళ్లున్నారు. రూ.1 కోటి వద్ద హనుమ విహారి, ఉమేష్ యాదవ్​లతో పాటు 11 మంది ఉన్నారు.

మొత్తం 164 భారత క్రికెటర్లు, 125 మంది విదేశీయులు, ముగ్గురు అసోసియేటెడ్​ నేషన్​ ఆటగాళ్లు ఉన్నారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ నుంచి వివో పూర్తిగా.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.