ETV Bharat / sports

అభిమాని టచ్ చేస్తే క్రికెటర్​ బట్టలు మార్చాల్సిందే!

author img

By

Published : Mar 21, 2021, 9:56 AM IST

లీగ్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలు, క్రికెటర్లు పాటించాల్సిన కొన్ని నిబంధనల్ని బీసీసీఐ విడుదల చేసింది. ఇంతకీ అవేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

IPL 2021: If touched by fans, players will have to change clothes
అభిమాని టచ్ చేస్తే క్రికెటర్​ బట్టలు మార్చాల్సిందే!

ఐపీఎల్ ప్రారంభానికి​ సమయం దగ్గరపడుతోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో లీగ్​ నిర్వహణపై సందేహాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్​ల్ని సజావుగా జరిపేందుకు 50 పేజీలతో కూడిన నిబంధనల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విడుదల చేసింది.

*ప్రాక్టీసు సెషన్​, మ్యాచ్​ జరుగుతున్నప్పుడు ఎవరైనా వీక్షకుడు లేదా అభిమాని.. క్రికెటర్లకు దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తే సెక్యూరిటీ గార్డులు అతడిని అదుపులోకి తీసుకుంటారు. సదరు ఆటగాడు వెంటనే తన దుస్తులను మార్చుకోవాల్సి ఉంటుంది.

IPL 2021
ఐపీఎల్ 2021

*బయో బబుల్​లో ఉన్న సహచర ఆటగాళ్లను కలిసే 20 సెకన్ల ముందు సదరు క్రికెటర్ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ వీక్షకులు ఎవరైనా క్రికెటర్ల కిట్​ బ్యాగ్​ను తాకినా సరే, దానిని శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.

*చేతులు శానిటైజ్ చేసుకున్న తర్వాతే సబ్​స్టిట్యూట్, మైదానంలోకి డ్రింక్స్ తీసుకెళ్లాలి. ఆటగాళ్లు కూడా డ్రింక్స్ తాగడానికి ముందు, తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.

*ప్రతి ​మ్యాచ్​ పూర్తయిన తర్వాత ఇరుజట్ల క్రికెటర్లు షేక్​హ్యాండ్ ఇచ్చుకోవడం, కలుసుకోవడం నిషిద్ధం. స్టేడియంలో స్నానాలు కూడా చేయకూడదు. ఏంటీ డోపింగ్ అధికారులూ.. పీపీఈ కిట్లు ధరించి ఆటగాళ్లకు పరీక్షలు జరపాలి.

IPL 2021
ఐపీఎల్ 2021 సీజన్

*వినోద కార్యకలాపాల్లో భాగంగా గోల్ఫ్ కోర్స్​కు జట్టు సభ్యులు వెళ్లాలంటే సదరు ఫ్రాంచైజీ, బీసీసీఐ వైద్యుడు నుంచి కనీసం 24 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

*హోటల్​ నుంచి గోల్ఫ్​ కోర్స్​కు వెళ్లడంలో భాగంగా క్రికెటర్లకు కేటాయించిన వాహనాలు ఎక్కడ ఆగకూడదు.

*ఏప్రిల్ 9 నుంచి షురూ అయ్యే ఐపీఎల్​ ప్రారంభం మ్యాచ్​లు ముంబయి, చెన్నైలోజరగుతాయి. ఆ తర్వాత దిల్లీ, బెంగళూరు, కోల్​కతా, అహ్మదాబాద్​లో నిర్వహిస్తారు. తొలి పోరు ముంబయి-బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

IPL 2021
ఐపీఎల్ ముంబయి ఇండియన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.