ETV Bharat / sports

ఐపీఎల్​: దిల్లీకి ఎదురుదెబ్బ- అక్షర్​ పటేల్​కు కరోనా!

Big blow for DC as Axar Patel tests positive for COVID-19
అక్షర్​ పటేల్​కు కరోనా
author img

By

Published : Apr 3, 2021, 2:12 PM IST

Updated : Apr 3, 2021, 2:27 PM IST

14:07 April 03

ఐపీఎల్​: దిల్లీకి ఎదురుదెబ్బ- అక్షర్​ పటేల్​కు కరోనా!

ప్రతిష్టాత్మక ఐపీఎల్​కు ముందు దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు అక్షర్​ పటేల్​కు కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఈ సారి లీగ్​ జరిగేది అనుమానంగానే మారింది. టోర్నీకి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఇప్పటికే వాంఖడే స్టేడియంలోని ఎనిమిది మంది స్టాఫ్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది.

''దురదృష్టవశాత్తు అక్షర్​ పటేల్​కు కరోనా నిర్ధరణ అయింది. అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నాడు.'' అని ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి.

ఇదివరకే కోల్​కతా నైట్​రైడర్స్​ ఆటగాడు నితీశ్​ రాణాకు పాజిటివ్​ వచ్చింది. తాజాగా చేసిన టెస్టుల్లో నెగెటివ్ నివేదిక వచ్చింది. కొవిడ్ నిర్ధరణ అయిన ఐపీఎల్​ ఆటగాళ్లలో అక్షర్​ రెండో క్రికెటర్​.

ఇదీ చదవండి: 'క్వారంటైన్​ను ఎలా కరిగించాలో చెప్పండి'

Last Updated : Apr 3, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.