ETV Bharat / sports

'ఖాళీ మైదానాలున్నా.. ఐపీఎల్​ మజా తగ్గదు'

2020 ఐపీఎల్​ను బయో సెక్యూర్​ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు నిర్వహించనున్నారు! ఇలా ఖాళీ స్టేడియాల్లో లీగ్​ జరిగినా.. ఆటపై ఎటువంటి ప్రభావం ఉందని తెలిపాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాటింగ్​ మార్గనిర్దేశకుడు వీవీఎస్​ లక్ష్మణ్.

IPL 2020
లక్ష్మణ్​
author img

By

Published : Aug 25, 2020, 9:09 AM IST

ఈ ఏడాది ఐపీఎల్‌ ఖాళీ స్టేడియాల్లో జరిగినప్పటికీ.. ఆట నాణ్యతపై ఆ ప్రభావం ఉండదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ మార్గనిర్దేశకుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. కరోనా పరిస్థితుల మధ్య బయో సెక్యూర్​ వాతావరణంలో లీగ్​​ నిర్వహించనున్న నేపథ్యంలో లక్ష్మణ్​​ తన అభిప్రాయాలు తెలిపాడు. సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ఐపీఎల్​ ప్రారంభం కానుంది.

IPL 2020
ఐపీఎల్​

"మైదానంలో ఎక్కడా జనం లేకపోయినా, స్టాండ్స్‌ ఖాళీగా ఉన్నా అభిమానులు ఐపీఎల్​ మ్యాచ్‌లను కచ్చితంగా ఆస్వాదిస్తారని నేను భరోసా ఇవ్వగలను. మ్యాచ్‌ల తాలూకు ఉత్సాహం, ఆటలో నాణ్యత ఎంతమాత్రం తగ్గవు. అయితే యూఏఈలో పిచ్‌లు మాత్రం కొంచెం నెమ్మదిగా ఉండే అవకాశముంది. కానీ మైదాన సిబ్బంది మనల్ని ఆశ్చర్యపరిచేలా ఏమైనా చేస్తారేమో చూడాలి. ఇక్కడి స్టేడియాల్లో ఔట్‌ ఫీల్డ్‌ మాత్రం అద్భుతంగా ఉంటుంది".

వీవీఎస్​ లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

గత వేలంలో ప్రియమ్‌ గార్గ్‌, విరాట్‌ సింగ్‌, బి.సందీప్‌ లాంటి కుర్రాళ్లను ఎంచుకోవడంపై వీవీఎస్‌ మాట్లాడుతూ.. "ఒక ప్రణాళిక ప్రకారమే వేలంలో యువ క్రికెటర్లను తీసుకున్నాం. ఈ కుర్రాళ్లు దేశవాళీల్లో చక్కటి ప్రదర్శన చేశారు. దేశీయ, విదేశీ ఆటగాళ్లలో అనుభవజ్ఞులు చాలామంది మాకు అందుబాటులో ఉన్నారు". అని వివరించాడు.

IPL 2020
ఐపీఎల్​

స్వాన్సర్​ జాబితా నుంచి ఫ్యూచర్​ ఔట్​..​

మరోవైపు ఐపీఎల్​ స్పాన్సర్​షిప్​ జాబితా నుంచి ఫ్యూచర్​ గ్రూప్​ వైదొలిగింది. ఫలితంగా లీగ్​ వెబ్​సైట్​ నుంచి ఆ సంస్థ లోగోను తొలగించినట్లు బీసీసీఐ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఫ్యూచర్​ గ్రూప్​ కష్టాల్లో చిక్కుకుందని.. అందువల్లే స్పాన్సర్​గా కొనసాగేందుకు చెల్లించాల్సిన రూ.40 కోట్లు కట్టలేకపోయిందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.