ఏ టోర్నీకి ముందైనా విరాట్ కోహ్లీ సన్నాహకమే ఇంకో స్థాయిలో ఉంటుంది. ఆట, ఫిట్‌నెస్ మాత్రమే కాదు. బ్యాట్ల విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న అతడు.. పొడుగ్గా ఉన్న ఓ బ్యాట్‌ను రంపంతో కోస్తున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెట్టాడు.
"బ్యాట్‌ను సమతూకంగా ఉంచడానికి కొన్ని సెంటీమీటర్లు కూడా విలువైనవే. బ్యాట్‌లను జాగ్రత్తగా చూసుకోవడం అంటే నాకిష్టం" అని విరాట్ ఈ వీడియోకు ఒక శీర్షికను జత చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">