ETV Bharat / sports

ఐపీఎల్​2020: ఈ విదేశీ ఆటగాళ్లూ సత్తా చాటగలరు! - ఐపీఎల్​ న్యూస్​

ఐపీఎల్​లో దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లూ సత్తా చాటుతున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో వారి స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. టీ20 ఫార్మాట్​లో అలాంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన టాప్​-5 విదేశీ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా.

IPL 2020: 5 unanticipated overseas players who could be the x-factor for their sides
టాప్​-5: ఐపీఎల్​లో కీలకమైన విదేశీ ఆటగాళ్లు
author img

By

Published : Aug 25, 2020, 7:14 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) 13వ సీజన్​కు కౌంట్​డౌన్​ ప్రారంభమైంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లూ భాగం కానున్నారు. వారిలో ప్రతిభావంతులైన హార్డ్​ హిట్టింగ్​ టాప్​ బ్యాట్స్​మెన్ దగ్గర నుంచి అద్భుత బౌలర్లు, వికెట్​ కీపర్లు ఈసారి ఐపీఎల్​లో పాల్గొంటున్నారు.

విదేశీ ఆటగాళ్లలో ఎక్కువమంది టీ20 ఫార్మాట్​లో గణనీయంగా రాణిస్తున్నారు. వారంతా ఐపీఎల్​లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది. అలాంటి సత్తా కలిగినా.. అంత ప్రాధాన్యం లభించని ఆటగాళ్లు ఏ ఫ్రాంచైజీలో ఉన్నారో తెలుసుకుందాం.

IPL 2020: 5 unanticipated overseas players who could be the x-factor for their sides
మార్కస్​ స్టోయినిస్

5) మార్కస్​ స్టోయినిస్​ (దిల్లీ క్యాపిటల్స్​)

అరుదైన ఆటగాళ్ల జాబితాకు చెందిన వాడు మార్కస్​ స్టోయినిస్​. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్, నిలకడగా బౌలింగ్​ చేయగల సామర్థ్యం​ ఇతనిలో ఉన్నాయి. టీ20 ఫార్మాట్​కు స్టోయినిస్​ ఆటతీరు బాగా నప్పుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్రికెటర్​లో మంచి ఫీల్డర్​ కూడా ఉన్నాడు.

2015లో క్రికెట్​ కెరీర్​ ప్రారంభించిన స్టోయినిస్​కు ఆరంభంలో ఒడుదుడుకులు ఎదురయ్యాయి. తిరిగి రాణించాలని కలగా పెట్టుకున్న స్టోయినిస్​.. 2017లో కివీస్​తో జరిగిన మ్యాచ్​లో 146 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. 2018-19 ఏడాదికిగానూ ఆస్ట్రేలియా వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​గా గుర్తింపు పొందాడు. 2019 ప్రపంచకప్​లోనూ భాగమయ్యాడు.

బిగ్​బాష్​ లీగ్​ 2018-19లో మెల్​బోర్న్​ స్టార్స్​కు ప్రాతినిధ్యం వహించిన స్టోయినిస్​ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఆ టోర్నీలో 53.30 సగటుతో 533 పరుగులు సాధించి.. అదే సమయంలో 14 వికెట్లు పడగొట్టాడు. ఆల్​రౌండర్​గా ప్రతిభ కనుబరుస్తున్న​ స్టోయినిస్​ ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ఆండ్రూ టై

4) ఆండ్రూ టై (రాజస్థాన్​ రాయల్స్​)

ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టైకి టీ20 ఫార్మాట్​లో అద్భుత రికార్డు ఉంది. 26 ఏళ్ల వయసులో 2013-14 సీజన్​లో​ ఆస్ట్రేలియా-ఏ జట్టు ద్వారా అరంగేట్రం చేసిన టై.. అనతికాలంలోనే టాప్​ ర్యాంక్​ ఆటగాడిగా ఎదిగాడు. మూడేళ్ల తర్వాత భారత్​తో జరిగిన సిరీస్​లో ఆసీస్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్​లో తొలుత గుజరాత్​ లయన్స్​ జట్టులో ఆడి.. తొలి మ్యాచ్​లోనే హ్యాట్రిక్​ సాధించాడు. అరంగేట్రంలోనే (5/17) అసాధారణ ప్రతిభ కనబరచాడు.

దీంతో 2018లో ఐపీఎల్​ కోసం జరిగిన వేలంలో ఆండ్రూ టై కోసం చెన్నై, రాజస్థాన్​, పంజాబ్​ యాజమాన్యాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్​ జట్టు రూ.7.2 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. ఆ ఏడాది టోర్నీలో 24 వికెట్లు సాధించి పర్పుల్​ క్యాప్​ను అందుకున్నాడు. ఐపీఎల్​ 13వ సీజన్​లోనూ అదే ప్రదర్శనతో ఆకట్టుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

అలెక్స్​ కారే

3) అలెక్స్​ కారే (దిల్లీ క్యాపిటల్స్​)

వికెట్​ కీపింగ్​లో నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శిస్తున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్​ కారే. దీంతో పాటు స్టార్​ బ్యాట్స్​మన్​గా గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్​లో 500 పరుగులు సాధించి.. వికెట్​ కీపర్​గా 50 ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టులో కీపర్​గా రిషబ్​ పంత్​ ఉండగా.. అతడికి ప్రత్యామ్నాయంగా కారేను జట్టులోకి తీసుకున్నారు.

జోష్ ఫిలిప్స్​

2) జోష్ ఫిలిప్స్​ (రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు)

ఆస్ట్రేలియాకు చెందిన జోష్​ ఫిలిప్స్​.. పరిమిత ఓవర్ల క్రికెట్​లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. ఏడాది ప్రారంభంలో జరిగిన బిగ్​బాష్​ లీగ్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీలో 37.46 సగటుతో 487 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన మూడో బ్యాట్స్​మన్​గా నిలిచాడు. మెల్​బోర్న్​ స్టార్స్​పై జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో 29 బంతుల్లో 52 పరుగులు సాధించి సిడ్నీ సిక్సర్స్​ జట్టుకు విజయాన్ని అందించడం సహా మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కించుకున్నాడు.

సెప్టెంబరులో జరగనున్న ఇంగ్లాండ్​ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేయనున్నాడు ఫిలిప్స్​. ఐపీఎల్​-2020 వేలంలో ఈ ఆటగాడికి నిర్ణయించిన రేటు కంటే తక్కువ మొత్తాన్ని వెచ్చించి (రూ.20 లక్షలు) రాయల్​ ఛాలెంజర్స్​ యాజమాన్యం సొంతం చేసుకుంది.

మిచెల్​ సాంట్నర్​

1)మిచెల్​ సాంట్నర్​ (చెన్నై సూపర్​కింగ్స్​)

ఈ ఏడాది ఐపీఎల్​ వేలంలో నిర్లక్ష్యానికి గురైన ఆటగాడు న్యూజిలాండ్​కు చెందిన మిచెల్​ సాంట్నర్​. యూఏఈ లాంటి మందకొడి పిచ్​లపై తన బౌలింగ్​తో మాయ చేయగల సామర్థ్యం ఈ ఆటగాడిలో ఉంది. 2015లో ఇంగ్లాండ్​పై తొలి ప్రదర్శన చేశాడు​. ఇతడు​ అంత బలవంతుడు కాకపోయినప్పటికీ బంతిని చాలా బలంగా విసరగలడు. ఈ బౌలర్​ శైలి యూఏఈ మైదానాలకు అనుకూలంగా ఉంటుంది. ఐపీఎల్​ 13వ సీజన్​లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.