ఐపీఎల్ 13వ సీజన్.. భారత్‌లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ స్పష్టతనిచ్చిన తర్వాతే దీని విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మనదేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతుండటం వల్ల టోర్నీని యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.
![IPL 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ipl-trophy-1_0207newsroom_1593679781_467.jpg)
"మేం ఐపీఎల్ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈసారి కచ్చితంగా బయటదేశంలోనే జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మ్యాచ్‌లను ఒకటి లేదా రెండు మైదానాల్లో, ప్రేక్షకుల లేకుండా జరపాలనే ఆలోచనతో ఉన్నాం. కరోనా ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో వేదిక యూఏఈ లేదా శ్రీలంక అనేది త్వరలో నిర్ణయిస్తాం" -బీసీసీఐ అధికారి
ఇదే విషయమై మాట్లాడిన ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.. తమ తొలి ప్రాధాన్యం స్వదేశమేనని అన్నారు. అయితే దీని విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు.
"మూడు, నాలుగు మైదానాల్లో కంటే ఎక్కువ వాటిలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరపలేం. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. అభిమానులు లేకుండా టోర్నీని ఒకవేళ జరిపితే ఎక్కడ ఆడినా పర్వాలేదు. కాకపోతే టీవీ ప్రసార వేళలు చూసుకుంటే సరిపోతుంది" -బ్రిజేశ్ పటేల్, ఐపీఎల్ ఛైర్మన్
ఐపీఎల్ 2020 ట్రోఫీ
ఇవీ చదవండి:
- ఐపీఎల్ మ్యాచ్‌లో ఏడవడంపై కుల్దీప్ సమాధానమిదే
- ఐపీఎల్లో చైనా స్పాన్సర్లపై త్వరలోనే నిర్ణయం
- ఐపీఎల్లో వార్నర్‌తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ
- 'ఐపీఎల్ ఆలస్యానికి ఆయనే కారణం'
- ఐపీఎల్ 2020: టోర్నీ నిర్వహించేది ఈ తేదీల్లోనే!
- ఐపీఎల్‌కు సిద్ధంగా ఉండండి: గంగూలీ
- 'అవకాశం ఇస్తే.. ఐపీఎల్ నిర్వహణకు మేము రెడీ'
- స్వదేశీ క్రికెటర్లతోనే ఐపీఎల్-2020 జరిగితే..?