కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఉండటం తమ అదృష్టమని ఆ జట్టు సారథి కేఎల్ రాహుల్ చెప్పాడు. అతడి వల్ల సారథిగా తన పని సులువైందని చెప్పాడు. కుంబ్లే వ్యూహాలను మైదానంలో సరిగ్గా అమలు చేస్తే, సులభంగా గెలవొచ్చని అన్నాడు.
"ఈ సీజన్‌లో అనిల్ భాయ్ మాతో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఒకే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి మైదానంలోనూ, బయట మా ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది. కెప్టెన్‌గా నా పని సులభం చేశాడు. జట్టు ప్రణాళికలు అతడే రూపొందిస్తాడు. వాటిని సరిగ్గా అమలు చేయడమే మా బాధ్యత"
- రాహుల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి
క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ తమ జట్టులో ఉండటం కలిసొచ్చే అంశమని చెప్పాడు రాహుల్. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
"మ్యాక్స్‌వెల్ గతంలోనూ పంజాబ్ తరఫున ఆడి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అందుకే వేలంలో అతడి కోసం పోటీపడి మరి తీసుకున్నాం. తనదైన రోజున అతడు ఏ బౌలింగ్‌నైనా చితక్కొట్టగలడు. గత రెండు సీజన్లలో మా జట్టు మిడిలార్డర్‌లో అలాంటి బ్యాట్స్‌మన్ లేని లోటు కనిపించింది. గేల్‌తో కూడా చాలా ఏళ్లు కలిసి ఆడాను. వారిద్దరు మా జట్టులో ఉండటం ఎంతో మేలు"
-రాహుల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి
రాహుల్ గత రెండు సీజన్లలో పంజాబ్‌కు ఆడి అద్భుతంగా రాణించాడు. 2018లో 659 పరుగులు.. 2019లో 593 పరుగులు చేశాడు. ఇప్పుడు తొలిసారిగా సారథిగా తన నైపుణ్యాలు పరీక్షించుకోనునున్నాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ లీగ్ జరగనుంది.
ఇదీ చూడండి రైనా బంధువులపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు