సాధారణంగా వన్డేల్లో 400 పైగా పరుగులు సాధించాలంటే ఏ దేశానికైనా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండాల్సిందే. 2007లో మనం ఈ రికార్డు సాధించేటప్పటికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక మాత్రమే ఈ ఘనత సాధించాయి. కానీ తొలిసారి భారత్ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ఫలితంగా ప్రపంచకప్‌లో శ్రీలంక పేరిట ఉన్న 398 పరుగులు రికార్డు బద్దలైంది.
బెర్ముడాపై తొలుత బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 50 ఓవర్లలో 413 పరుగులు భారీ స్కోర్ చేసింది. సెహ్వాగ్ 114 పరుగులు, గంగూలీ 89, యువరాజ్ 83, సచిన్ 57 నాటౌట్‌గా నిలిచారు. లక్ష్య ఛేదనలో బెర్ముడా 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 257 పరుగుల భారీ విజయం టీమిండియా సొంతమైంది.
- మ్యాచ్ ముఖ్యాంశాలు:
- 257 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
- 2011 వరకు ఏ దేశం ప్రపంచకప్‌లో 400 పరుగులు చేయలేకపోయింది.
- కుంబ్లే ఈ మ్యాచ్ తర్వాత వన్డేల్లో ఆడలేదు.
- బెర్ముడాపై గెలిచిన భారత్ తర్వాత ఆ తర్వాత వన్డేలో ఊహించని ఓటమి ఎదుర్కొంది. పసికూన బంగ్లాదేశ్‌పై ఓడిపోయి ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టింది.
.
#OnThisDay in 2007, Bangladesh stunned India at the World Cup! pic.twitter.com/mQQgJiKXYH
— Cricket World Cup (@cricketworldcup) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#OnThisDay in 2007, Bangladesh stunned India at the World Cup! pic.twitter.com/mQQgJiKXYH
— Cricket World Cup (@cricketworldcup) March 17, 2019#OnThisDay in 2007, Bangladesh stunned India at the World Cup! pic.twitter.com/mQQgJiKXYH
— Cricket World Cup (@cricketworldcup) March 17, 2019