ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ సిరీస్​తో లాక్​డౌన్​కు ముగింపు! - భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్

ఐపీఎల్ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్​తో సిరీస్​ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇదే విషయమై ఇరుదేశ బోర్డుల మధ్య చర్చ జరుగుతోంది.

India's cricket lockdown could end with England series: Reports
కోహ్లీ-మోర్గాన్
author img

By

Published : Sep 20, 2020, 6:01 PM IST

భారత క్రికెట్​లో లాక్​డౌన్​కు ముగింపు పలకనున్నారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్​ను ఆహ్వానించి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. తమ అభిమాన క్రికెటర్ల ఆటను స్వదేశంలో చూడనున్నారని బోర్డు అధికారి చెప్పారు.

India's cricket lockdown could end with England series
భారత్-ఇంగ్లాండ్ సిరీస్

"ఐపీఎల్​ను యూఏఈలో జరిపేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత ఇతర దేశాల క్రికెట్​ బోర్డులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. స్వదేశంలో ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం. త్వరలో ఇది జరుగుతుందని అనుకుంటున్నాం" -బీసీసీఐ అధికారి

దీనితో పాటే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని బీసీసీఐ అధికారి చెప్పారు. ఆ దేశం టీమ్​ఇండియాకు రెండో ఇల్లులాంటిదని పేర్కొన్నారు.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి కరోనా ప్రభావం తగ్గకపోతే వచ్చే ఐపీఎల్​ కూడా యూఏఈలో నిర్వహించే అవకాశమూ లేకపోలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.