టీమిండియా తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో గతేడాది నిలకడ ప్రదర్శన చేసిన పుజారా... ఈ సంవత్సరమూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. సౌరాష్ట్రకు చెందిన ఈ క్రికెటర్.. కెరీర్లో మరో ఫస్ట్‌క్లాస్ సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్లో 50 సెంచరీల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించిన దిగ్గజాలు సచిన్, గావస్కర్, ద్రవిడ్ సరసన చోటు దక్కించుకున్నాడు. శనివారం కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు పుజారా.
అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఎక్కువ శతకాలు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్, గావస్కర్(81) అగ్రస్థానంలో ఉన్నారు. ద్రవిడ్ 68 సెంచరీలతో రెండో స్థానంలో పుజారా కంటే ముందున్నారు.
నాలుగోవాడు
ఫస్ట్‌క్లాస్‌లో 50 సెంచరీలు మార్క్ అందుకుని.. ఇప్పటికీ ఆడుతున్న వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు పుజారా. ఇతడి కంటే ముందు అలిస్టర్ కుక్(65), వసీం జాఫర్(57), హసీం ఆమ్లా(52) ఉన్నారు. వీరందరిలో పిన్నవయస్కుడిగా పేరు తెచ్చుకున్నాడీ నయావాల్. ఇతడికి ప్రస్తుతం 31 ఏళ్లు. ఇతడితో సహా ఆటగాళ్లయిన కోహ్లీ(34), రహానే(32).. ఫస్ట్‌క్లాస్‌లో ఇతడి కంటే తక్కువ శతకాలే చేశారు.
సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. పుజారా 162 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.