ETV Bharat / sports

అశ్విన్​ రికార్డ్​- టెస్టుల్లో 400 వికెట్లు ​

భారత స్పిన్నర్​ అశ్విన్​ మరో ఘనత దక్కించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 400 వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డులకెక్కాడు. ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో ఆర్చర్​ వికెట్​ తీయడం ద్వారా ఈ ఫీట్​ను సాధించాడు.

Indian spinner Ashwin holds the record for taking 400 wickets in test format.
టెస్టుల్లో 400 వికెట్లు తీసిన అశ్విన్​
author img

By

Published : Feb 25, 2021, 6:27 PM IST

Updated : Feb 25, 2021, 6:57 PM IST

భారత స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకు అశ్విన్​ 77 టెస్టులు తీసుకోగా.. శ్రీలంగ దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్​​ 72 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధించాడు.

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతోన్న పింక్​ టెస్టులో ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో ఆర్చర్​ వికెట్​ తీసి.. ఈ ఫీట్​ సాధించాడు యాష్​. తాజా ఫీట్​తో అశ్విన్​.. న్యూజిలాండ్​ బౌలింగ్​ లెజెండ్​ రిచర్డ్​ హాడ్లీ, సౌతాఫ్రికా పేస్​ దిగ్గజం డేల్​ స్టెయిన్​ను అధిగమించాడు. వీరిద్దరికీ ఈ రికార్డు అందుకోవడానికి 80 టెస్టులు పట్టింది.

అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 600 వికెట్లు తీసిన బౌలర్​గానూ అశ్విన్​ రికార్డు సాధించాడు. బుధవారం నాటి మ్యాచ్​లో జహీర్​ ఖాన్​ను అధిగమించాడు యాష్. ఈ జాబితాలో భారత బౌలర్లలో అశ్విన్​ కంటే ముందు అనిల్ కుంబ్లే(953), హర్భజన్​ సింగ్(707), కపిల్​ దేవ్​(687) ఉన్నారు. ​

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​ బెన్​ స్టోక్స్​ను అత్యధిక సార్లు ఔట్​ చేసిన బౌలర్​గానూ అశ్విన్​ రికార్డు సాధించాడు. యాష్​ ఇప్పటివరకు 11 సార్లు స్టోక్స్​ను పెవిలియన్​ చేర్చాడు.

ఇదీ చదవండి: 81 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌట్​- భారత్​ లక్ష్యం 49

Last Updated : Feb 25, 2021, 6:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.