ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు యార్కర్లు వేయడం వెన్నతో పెట్టిన విద్య. డెత్ ఓవర్లలో కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థులను భయపెడుతుంటాడు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో అత్యుత్తమ యార్కర్ బౌలర్ ఎవరంటే మాత్రం మలింగ అంటూ చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్ మెరుగవడానికి ఈ లంక బౌలర్ బాగా సహాయపడ్డాడని చెప్పాడు బుమ్రా. వీరిద్దరూ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నారు.
"ప్రపంచంలో అత్యుత్తమ యార్కర్ బౌలర్ మలింగ. యార్కర్ల విధానాన్ని ఎన్నో ఏళ్లుగా అద్భుతంగా ప్రయోగిస్తూ.. మంచి ఫలితాలు రాబడుతున్నాడు"
-బుమ్రా
లాక్డౌన్ వల్ల బౌలింగ్ ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగిందని చెప్పిన బుమ్రా.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
ప్రత్యామ్నాయం అవసరం..
బంతికి ఉమ్మి రాయడాన్ని ఐసీసీ నిషేధించడంపైనా స్పందించాడు బుమ్రా. ఈ నిబంధన వల్ల బౌలర్లకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఉమ్మికి ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచించాలని కోరాడు. కరచాలనం, హత్తుకోవడం నిషేధించడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు.
"నేను హత్తుకునేందుకు, కరచాలనం చేసేందుకు ఎక్కువగా ప్రయత్నించను. కాబట్టి నాకు అది పెద్ద సమస్యేమి కాదు. కానీ బంతికి ఉమ్మి రాయొద్దు అంటే కష్టం. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఐసీసీ నిబంధనలు పెట్టడం మంచిదే కానీ వాటిల్లో ఉమ్మి వాడకంపై నిషేధంతోనే ఇబ్బంది. దానికి ప్రత్యామ్నాయం అవసరం. బంతి బౌలర్లకు సహకరించకపోతే మ్యాచ్ ఫలితాలే మారిపోతాయి. మైదానాలు చిన్నవి అవుతున్నాయి. వికెట్లు ఫ్లాట్‌గా రూపొందిస్తున్నారు. ఇవన్నీ బ్యాట్స్‌మన్‌కు లాభించేవే. కానీ బౌలర్లు మాత్రం బంతిని కట్టడి చేయడం కోసం బాగా శ్రమించాల్సి వస్తోంది. మెరుపులేని బంతితో స్వింగ్ రాబట్టడం కొంచెం కష్టం."
-బుమ్రా, టీమ్ఇండియా బౌలర్
గతంలో బుమ్రాపైనా ప్రశంసలు కురిపించాడు మలింగ. అంత సులువుగా యార్కర్లను సంధించడానికి జస్ప్రీత్ బాగా కష్టపడ్డాడని తెలిపాడు. అతి తక్కువ కాలంలోనే ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్, స్లో బాల్స్ వేయడం నేర్చుకున్నాడని.. అందుకే ప్రపంచ నెంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడని బుమ్రాను మెచ్చుకున్నాడు స్లింగ.
-
How has Jasprit Bumrah perfected his lethal outswinger?
— ICC (@ICC) June 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
📽️ WATCH as he discloses the secret 👇 pic.twitter.com/uc4KsYYiNG
">How has Jasprit Bumrah perfected his lethal outswinger?
— ICC (@ICC) June 1, 2020
📽️ WATCH as he discloses the secret 👇 pic.twitter.com/uc4KsYYiNGHow has Jasprit Bumrah perfected his lethal outswinger?
— ICC (@ICC) June 1, 2020
📽️ WATCH as he discloses the secret 👇 pic.twitter.com/uc4KsYYiNG